Big Stories

Beauty Tips: మెరిసే ముఖం కోసం.. ఈ ఫేస్ ప్యాక్ లు ట్రై చేయండి !

Curry Leaves Face Pack For Glowing Skin: అందంగా కనిపించడం కోసం చాలా మంది ఎన్నో రకాల బ్యూటీ ప్రాడక్ట్స్‌ వాడుతుంటారు. కొన్ని రకాల ప్రాడక్ట్స్‌ వాడడం వల్ల ముఖంపై మచ్చలు, మొటిమలు వస్తుంటాయి. కానీ న్యూచురల్ ప్రాడక్ట్స్‌ వాడడం వల్ల ఫేస్ అందంగా కనిపిస్తుంది. వంటింట్లో లభించే కరివేపాకు ఫేస్‌ప్యాక్‌లు వేసుకోవడం వల్ల అందమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

ప్రతి ఒక్కరి వంటింట్లో కరివేపాకు ఉంటుంది. వంట ఏదైనా రెండు రెమ్మల కరివేపాకు వేస్తే రుచి, సువాసనతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కరివేపాకుతో ఆరోగ్యమే కాదు..అందం కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకోసం కొన్ని ఫేస్​ ప్యాక్​లు ట్రై చేయమంటున్నారు. అవేంటంటే..

- Advertisement -

కరివేపాకు పేస్ట్: కరివేపాకు ఫేస్‌ప్యాక్‌ను తయారు చేసుకోవడం కోసం ముందుగా 5 కరివేపాకు రెమ్మలను నీటిలో ఉడకబెట్టాలి. ఆ తర్వాత ఆకులను నీటిలో నుంచి తీసి పేస్ట్‌లా తయారు చేసుకుకోవాలి. ఈ పేస్ట్‌లోకి కొంచెం పెరుగు లేదా పాలను వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా తేనెను కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో క్లీన్‌ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు నుంచి మూడు సార్లు చేస్తే ముఖంపై ఉన్న మచ్చలు, మొటిమలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

Also Read:ఇమ్యూనిటీని పెంచి..రోగాలను దూరం చేసే ఆహారాలు ఇవే..

కరివేపాకుతో ఫేస్‌ ప్యాక్‌లతో పాటు, కరివేపాకు మరగబెట్టిన నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవడం వల్ల కూడా అద్భుత ఫలితాలు ఉంటాయిని నిపుణులు చెబుతున్నారు. కరివేపాకు వాటర్‌తో ఫేస్‌ కడుక్కోవడం వల్ల ముఖంపై మచ్చలు తగ్గడంతో పాటు ముఖం తళతళ మెరిసిపోతుందని అంటున్నారు. కరివేపాకు నీళ్లలో కాస్త నిమ్మరసం, శనగపిండి కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని ముఖానికి ఫేస్‌ ప్యాక్‌ లాగా అప్లై చేసుకోవచ్చు. ఇలా ఇలా చేయడం వల్ల కూడా ముఖం మెరుస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News