BigTV English

AP Elections 2024: చంద్రబాబు ఆగ్రహం.. మీరే తిప్పి కొట్టాలంటూ..

AP Elections 2024: చంద్రబాబు ఆగ్రహం.. మీరే తిప్పి కొట్టాలంటూ..

AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ పలు చోట్ల ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. వైసీపీ నేతలు, కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన ట్వీట్ చేశారు.


“నేటి పోలింగ్ లో వైకాపా హింస ఎంతవరకు వెళ్లిందంటే.. కనీసం పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయింది. తాడిపత్రిలో ఏకంగా ఎస్పీ వాహనంపైనే దాడి చేయడం.. తాడిపత్రి టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డిపై దాడికి దిగడం, వైసీపీ హింసా రాజకీయాలకు పరాకాష్ట. జగన్ 5 ఏళ్లుగా పెంచి పోషించిన రౌడీ మూకలు.. ఈరోజు తమ దాడుల ద్వారా ప్రజల్లో భయం పుట్టించి పోలింగ్ శాతాన్ని తగ్గించడం ద్వారా లబ్ధి పొందే కుట్ర చేస్తున్నారు. ప్రజలారా.. ఈ కుట్రను మీరే తిప్పికొట్టాలి.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు అందరూ నిర్భయంగా తరలివచ్చి ఓటు వేయాలి. అత్యధిక ఓటు శాతంతో వైసీపీ హింసా రాజకీయానికి ముగింపు పలకాలి” అంటూ చంద్రబాబు అందులో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. అయితే పలు పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6 గంటల లోపు క్యూలైన్లలో నిల్చున్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. వారు ఓటు హక్కును వినియోగించుకున్నారు.


Also Read: ఏపీలో గతంతో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగింది: ఎంకే మీనా

కాగా, ఎన్నికల వేళ పలు చోట్లా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పల్నాడు జిల్లా నరసరావుపేటలో చాలా సేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగించి రెండు వర్గాలను చెదరగొట్టారు. అదేవిధంగా గూడూరు నియోజకవర్గం చిల్లకూరులో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో వారు పరస్పర దాడులు చేసుకున్నారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆముదాలవలస నియోజకవర్గంలోని గోకర్ణపల్లిలో కూడా ఉద్రిక్తత నెలకొన్నది. రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో పలువురికి గాయాలయ్యాయి.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×