Chicken Preparation With House Cleaning Stick: ప్రస్తుత కాలంలో ఆహార పదార్థాలపై చాలా మంది ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ లేకుండా జంక్ ఫుడ్ తింటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇదే అదునుగా చాలా మంది ఆహారానికి సంబంధించిన ఫుడ్ స్టాల్స్ పెట్టేస్తున్నారు. ఎక్కడ చూసినా టిఫిన్ సెంటర్లు, బీబీక్యూలు, రెస్టారెంట్లు, దాబాలు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ వంటివి దర్శనమిస్తున్నాయి. దీంతో కనిపించిన వెంటనే ఏదో ఒకటి తినేయాలని చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ తరుణంలో జంక్ ఫుడ్‌కు ఆదరణ పెరిగిపోతుంది. అయితే తాజాగా తయారుచేస్తున్న ఇటువంటి వంటకాలు, ఆహారపదార్థాలను దారుణంగా తయారు చేసి అమ్ముతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో తాజాగా వైరల్ అవుతోంది.
రోడ్లు ఏడ్చే చీపుర్లతో పెనంపై నీళ్లు తుడిచి దోశలు వేయడం చూసే ఉంటారు. ఏ హోటళ్లలో చూసినా కూడా ఇదే పద్ధతి కనిపిస్తుంది. ఊడ్చే చీపురుతో దోశలు వేయడానికి సంబంధించిన వీడియోలు చూసి చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. అయితే తాజాగా ఓ మహిళ ఇంట్లో ఫ్లోర్ తుడిచే కర్రను వంట గదిలో వంట చేసేందుకు వాడింది. చికెన్ తయారు చేసేందుకు ఇళ్లు తుడిచే మార్ఫ్‌ను ఉపయోగించడం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Also Read: Black Jalebi: ఓరి నాయనో.. బ్లాక్ జిలేబీలంటా.. అసలు వీటిని ఎవరైనా తింటారా..?
బీబీక్యూ తరహాలో ఓ మహిళ చికెన్ చేసింది. ఓ రెస్టారెంట్‌లో చికెన్ చేస్తూ విచిత్రమైన టెక్నిక్ ఉపయోగించింది. ఇళ్లల్లో తుడిచే మార్ఫ్ ను ఉపయోగించి చికెన్ ముక్కలపై ఆయిల్ ను వేసింది. ఇలా రెండు సార్లు ఫ్రై అవుతున్న బీబీక్యూ చికెన్ పై ఆయిల్ వేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి నెటిజన్లు స్పందిస్తూ విచిత్రమైన కామెంట్లు పెడుతున్నారు. ఛీఛీ ఇంకొకసారి రెస్టారెంట్లలో ఇలాంటి చికెన్ అస్సలు తినం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
?utm_source=ig_web_copy_link">