Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు ప్రపంచం మొత్తానికి పరిచయమే చేయాల్సిన అవసరం లేదు.
స్వయంకృషితో పైకి ఎదిగే ప్రతి ఒక్క నటుడికి చిరునే ఇన్స్పిరేషన్. ఆయన నాటిన మహా వృక్షం నుంచే ఎంతోమంది మెగా హీరోలు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
చిరు.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్. నటనకు అయినా.. సేవకు అయినా మొదట గుర్తొచ్చే పేరు. ఇండస్ట్రీ ఎలాంటి కష్టంలో ఉన్నా మొదట నేను ఉన్నాను అనే వ్యక్తి మెగాస్టార్.
ఆయన స్వాగ్ ను ఎవరు కాపీ చేయలేరు. ఎంతమంది నటులు వచ్చినా.. చరిత్రలో చిరు సృష్టించిన రికార్డులను ఎవరు కొట్టలేరు అని చెప్పడంలో అతిశయోక్తి కాదు.
విజయాపజయాలను పక్కన పెట్టి.. ఇప్పటికీ కుర్ర హీరోలకు ధీటుగా రెండు మూడు సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు మెగాస్టార్.
ప్రస్తుతం చిరు వయస్సు 69. ఈ వయస్సులో కూడా ఆయన ముఖంలో ఎక్కడా ఛార్మ్ తగ్గలేదు. తాజాగా చిరు కొన్ని ఫొటోస్ ను అభిమానులతో పంచుకున్నారు.
బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో మెగాస్టార్ అదరగొట్టేశారు. బ్లాక్ జీన్స్ .. బ్లాక్ ఫుల్ స్లీవ్స్ టీ షర్ట్.. బ్లాక్ గాగుల్స్ తో క్లాస్ లుక్ లో కనిపించి షాక్ ఇచ్చారు.
ప్రస్తుతం చిరంజీవి ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం చిరు.. విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కాకుండా శ్రీకాంత్ ఓదెల సినిమా ఒకటి లైన్లో ఉండగా.. మరో రెండు సినిమాలకు కథలు వింటున్నారని సమాచారం.