Gold Rate Today: దీపావళికి చుక్కలను తాకిన బంగారం ధరలు గత రెండు రోజులుగా భారీ స్థాయిలో తగ్గాయి. గత రెండు రోజుల్లో రూ.12 వేలకు పైగా బంగారం ధరలు పతనం అయ్యాయి. గురువారం ఉదయం స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. మధ్యాహ్నం నుంచి పుంజుకుంది. విజయవాడలో ఇవాళ బంగారం ధర 24 క్యారెట్లు గ్రాముకు రూ.12,508, 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.11,465, 18 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.9,381 ధర పలికింది. విజయవాడలో నిన్నటితో పోలిస్తే రూ.8000లకు(24 క్యారెట్లు) పైగా ధర తగ్గింది. బుధవారం గ్రాము రూ.12589 ఉండగా నేడు రూ.12508 చేరింది. విజయవాడలో నేడు వెండి ధర కిలో రూ.1,74,000గా ఉంది. నిన్నటితో పోలిస్తే వెండి కిలోకు రూ.1000 తగ్గింది.
హైదరాబాద్‌లో నేటి బంగారం ధర 24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రూ.12,508, 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.11,465, 18 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.9,381 గా ఉంది. హైదరాబాద్ లో కిలో వెండి రూ.1,74,000గా ఉంది.
విశాఖపట్నంలో ఈరోజు(అక్టోబర్ 23) బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 750 తగ్గి రూ. 1,14,650 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 810 తగ్గి రూ. 1,25,080 వద్ద ఉంది. వెండి ధర కిలోకు రూ. 1,74,000గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి.
Also Read: Jio Bumper Offer: ఒక్క రీచార్జ్‌తో మూడు నెలల ఎంటర్‌టైన్‌మెంట్.. జియో సర్‌ప్రైజ్ ఆఫర్
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గడానికి అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పతనం అవడమే కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ప్రస్తుతం ఔన్స్ బంగారం 4087 డాలర్ల దగ్గర, ఔన్స్ సిల్వర్ 48.45 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది.