Virat Kohli: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia vs India, 2nd ODI) మధ్య జరుగుతున్న రెండో వన్డేలో విరాట్ కోహ్లీ ( virat kohli ) అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి వన్డేలో డకౌట్ అయిన విరాట్ కోహ్లీ( virat kohli duck), అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో కూడా డకౌట్ అయ్యాడు. దీంతో తన అంతర్జాతీయ క్రికెట్ లో 40 సార్లు డకౌట్ అయిన ప్లేయర్ గా చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్ లో డకౌట్ అయిన నేపథ్యంలో అర్ధాంతరంగా ఆస్ట్రేలియా నుంచి లండన్ వెళ్తున్నట్లు విరాట్ కోహ్లీకి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. విమానాశ్రయంలో విరాట్ కోహ్లీ ఉన్నాడని, ఆస్ట్రేలియా నుంచి లండన్ వెళ్లిపోతున్నాడని ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోను చూసిన టీమిండియా అభిమానులు… విరాట్ కోహ్లీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండుసార్లు డకౌట్ అయితే, వెళ్ళిపోతావా ? అని సెటైర్లు పేల్చుతున్నారు.
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో అట్టర్ ఫ్లాఫ్ అయిన విరాట్ కోహ్లీ, లండన్ వెళ్తున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ కొడుకు అకాయ్ కోహ్లీ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందని.. అందుకే అర్ధాంతరంగా విరాట్ కోహ్లీ లండన్ వెళ్తున్నట్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. మళ్లీ మూడో వన్డే సమయానికి తిరిగి జట్టులో చేరతాడని కూడా సెటైర్లు పేల్చుతున్నారు. ఇక ఇది నిజమే అనుకోని చాలా మంది అభిమానులు విరాట్ కోహ్లీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, వాస్తవం అది కాదని తెలుస్తోంది. విరాట్ కోహ్లీ లండన్ కు వెళ్లడం లేదట. పాత వీడియోను ఇప్పుడు వైరల్ చేసి, కొంతమంది కావాలనే వైరల్ చేస్తున్నారని అంటున్నారు. కోహ్లీ కొడుకు వయస్సు 2 ఏళ్లు కూడా కాలేదు. ఇప్పటికే స్కూల్ వెళుతున్నాడని, స్కూల్ లో పేరెంట్స్ ఫంక్షన్ అంటూ పోస్టులు పెడుతున్నారు. 2 ఏళ్లు కూడా పూర్తి కానీ కుర్రాడు స్కూల్ కు ఎలా వెళతాడు అని కౌంటర్ ఇస్తున్నారు కోహ్లీ అభిమానులు. దీన్ని బట్టి, ఇదంతా ఫేక్ వీడియో అని అర్థం చేసుకోవచ్చును.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో వన్డేలో విరాట్ కోహ్లీ డకౌట్ అయిన సంగతి తెలిసిందే. అయితే విరాట్ కోహ్లీ డకౌట్ అయిన తర్వాత ఆయన అభిమానులు చాలా డిస్సప్పాయింట్ అయ్యారు. విరాట్ కోహ్లీ కూడా షాక్ లోనే ఉండిపోయాడు. అయితే అవుట్ అయిన తర్వాత వెళ్తు వెళ్తూ అభిమానులకు కోహ్లీ చేతిని పైకి చూపిస్తూ థాంక్స్ చెప్పాడు. దీంతో అతడు చెయ్ పైకి ఎత్తి సిగ్నల్స్ ఇచ్చిన ఫోటో వైరల్ గా మారింది. ఇదే అతని చివరి మ్యాచ్ అని, అందుకే కోహ్లీ అలా వ్యవహరించాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
🚨 Urgent
Virat Kohli leaves the team to attend Akaay’s parent-teacher meeting in London.
Will rejoin before the 3rd ODI.Source :- PTI#ViratKohli pic.twitter.com/PGVaV85xiH
— zoxxy (@PrimeKohli) October 23, 2025