BigTV English

The Raja Saab: అనుకున్నట్టే చేశాడు.. రాజా సాబ్‌పై మారుతిపై ఫ్యాన్స్ ఫైర్

The Raja Saab: అనుకున్నట్టే చేశాడు.. రాజా సాబ్‌పై మారుతిపై ఫ్యాన్స్ ఫైర్
Advertisement

The Raja saab: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)నేడు పుట్టినరోజు(Birthday) వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యంలో ఆయన అభిమానులు తన సినిమాలకు సంబంధించి వరుస అప్డేట్స్ వస్తాయని ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. ఈరోజు ప్రభాస్ అన్ని సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రాబోతున్నాయని ఎదురుచూసిన అభిమానులకు మేకర్స్ నిరాశ మాత్రమే మిగిల్చారని చెప్పాలి. ఈరోజు ఉదయం ప్రభాస్ హను రాఘవపూడి సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాకు ఫౌజీ (Fauzi)అని టైటిల్ పెట్టినట్లు ప్రకటించారు. ఇక మధ్యాహ్నం ది రాజా సాబ్ (The Raja Saab)సినిమా నుంచి మరొక అప్డేట్ వస్తుందని ఎదురు చూశారు.


ప్రభాస్ బర్త్ డే… నిరాశలో అభిమానులు..

ఇక చిత్ర బృందం తెలియజేసిన విధంగానే ఈ సినిమా నుంచి అప్డేట్ ఇచ్చారు కానీ ఆ అప్డేట్ ప్రేక్షకులకు ఏమాత్రం కిక్ ఇవ్వలేదని చెప్పాలి. కేవలం ఒక పోస్టర్ విడుదల చేసి మారుతి(Maruthi) చేతులు దులుపుకున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ విడుదల కాబోతుందని తెలియజేశారు తప్ప, ఫస్ట్ సింగిల్ ఎప్పుడు విడుదలవుతుందో కనీసం తేదీ కూడా ప్రకటించకపోవడంతో ప్రభాస్ అభిమానులు చిత్ర బృందం పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు అంటే పండుగలాగా ఉంటుందని అభిమానులు భావించారు కానీ వారికి నిరాశ మాత్రమే మిగిలింది.

పోస్టర్లతోనే సరిపెడుతున్న మేకర్స్..

ఇప్పటివరకు ప్రభాస్ కి సంబంధించిన రెండు సినిమాల అప్డేట్స్ వచ్చాయి కానీ ఇవేవీ ప్రేక్షకులకు సంతృప్తిని ఇవ్వలేదు. మరి ఈరోజు సాయంత్రం సందీప్ రెడ్డి స్పిరిట్ సినిమాకి సంబంధించిన అప్డేట్ రాబోతుంది. ఈ సినిమా నుంచి అయినా కొత్తగా అప్డేట్ ఇస్తారా లేదంటే పోస్టర్ తోనే సందీప్ వంగ సరిపెట్టుకుంటారా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ది రాజా సాబ్, ఫౌజీ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా నుంచి కనీసం ఒక వీడియోని కూడా విడుదల చేయకపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.


ఇక ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా జనవరి 9, 2026 న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా కామెడీ హర్రర్ర్ థ్రిల్లర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాదాపు ఈ సినిమా షూటింగ్ పనులన్నీ పూర్తి అయ్యాయని తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమాలో రెండు పాటలకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలతో పాటు ప్రభాస్ కల్కి 2, సలార్ 2 సినిమాలకు కూడా కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Also Read: Gummadi Narasaiah: గుమ్మడి నరసయ్యగా శివన్న.. ఆకట్టుకుంటున్న గ్లింప్స్!

Related News

Puri Sethupathi: ఆగిపోయిన పూరీ-సేతుపతి.. నిర్మాణ సంస్థ క్లారిటీ!

Actress Son Death: ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటి కుమారుడు కన్నుమూత?

The Girl friend: ట్రైలర్ ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

Upasana – Ramcharan : మెగా కంపౌండ్‌లో డబుల్ కన్ఫ్యూజన్.. ఈ పజిల్ వెనుక రహస్యం ఏంటి ?

Music director Death: మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూత.. అసలేం జరిగిందంటే?

Mohan Babu: బావ నువ్వు పెళ్లి చేసుకుని అర డజను మంది పిల్లలతో సంతోషంగా ఉండాలి!

Chiranjeevi : చిరు కేసుపై కోర్టు షాకింగ్ తీర్పు.. ఇకపై ‘మెగాస్టార్’ ట్యాగ్ వాడొద్దు..

Big Stories

×