BigTV English

Tuni Girl Incidnet: సొంత బంధువులే.. కామ పిశాచులై..

Tuni Girl Incidnet: సొంత బంధువులే.. కామ పిశాచులై..
Advertisement

Tuni Girl Incidnet: చిన్నప్పుడు పిల్లల్ని కంట్రోల్ చేసేందుకు.. అమ్మలు బూచాడి కథలు చెప్పేవాళ్లు. పిల్లలు తినకపోయినా, అల్లరి చేసినా.. బూచాడు ఎత్తుకెళ్లిపోతాడని.. ఓ చిన్న అబద్ధం చెప్పేవాళ్లు. కానీ.. ఇప్పుడు నిజాలే చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే.. బూచాళ్లు మన చుట్టూనే ఉన్నారు. ఇరుగు-పొరుగు వాళ్లలోనో, బంధువుల్లోనో.. ఇంకా చెప్పాలంటే.. ఇంట్లోనూ ఉన్నారు. వాళ్లు.. చిన్నారులపై ఎప్పుడు అఘాయిత్యానికి పాల్పడతారో తెలియదు. కానీ.. ఘోరం మాత్రం జరిగిపోతోంది. బాలికలపై వరుస అత్యాచార ఘటనలే.. ఈ దారుణాలకు నిదర్శనం. అందుకే.. ఇంత గట్టిగా చెబుతున్నది.. బూచాళ్లున్నారు జాగ్రత్త అని.!


పైకి మంచోళ్లలా కనిపించే కామ పిశాచులు

తెలుగు రాష్ట్రాల్లో బాలికలు సేఫ్‌గానే ఉన్నారా? వరుస దారుణాలు, అఘాయిత్యాలు గురించి వింటుంటే.. ఇదే ప్రశ్న తలెత్తుతోంది. ఈ సొసైటీలో రోజూ ఎన్నో దారుణాలు జరుగుతుంటాయ్. అందులో మన దృష్టికి వచ్చేవి కొన్ని అయితే.. మనదాకా రానివెన్నో ఉంటాయ్. అలాంటివాటిలో.. కొన్ని దారుణ ఘటనలు మనల్ని హెచ్చరిస్తాయ్. జాగ్రత్తగా ఉండమని సూచిస్తాయ్. అప్పుడు కూడా పట్టించుకోకపోతే.. మనకు తెలియకుండా జరిగే దారుణానికి మనమే బాధ్యులమవుతాం. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో బాలికలపై జరుగుతున్న వరుస అఘాయిత్యాలు.. తల్లిదండ్రులకే కాదు మొత్తం సమాజానికే డేంజర్ వార్నింగ్ పంపుతున్నాయ్. పైకి మంచోళ్లలా కనిపించే.. కామ పిశాచుల నుంచి మీ పిల్లలు సేఫ్‌గానే ఉన్నారా? అనే ప్రశ్నే.. ఇప్పుడు ఆందోళన పెంచుతోంది. రోజూ ఇంటి గడప దాటి వచ్చే మహిళలకే కాదు.. ఎక్కడో మారుమూల ఉండే గురుకుల పాఠశాలల్లో ఉండే మైనర్ బాలికలకు కూడా భద్రత లేకుండా పోయింది.

బాలిక పై తాత వయస్సున్న వ్యక్తి అఘాయిత్యం

కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో చదువుతున్న ఓ బాలికపై.. తాత వయసున్న వ్యక్తి అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించిన ఘటన.. ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపింది. తునికి చెందిన టీడీపీ దళిత నాయకుడు తాటిక నారాయణరావు.. విద్యార్థినికి వరుసకు తాతనవుతానని చెప్పి.. తోటలోకి తీసుకెళ్లాడు. బాలికపై అఘాయత్యానికి యత్నించగా.. తోట యజమాని అడ్డుకున్నాడు. ఈ తతంగాన్ని వీడియో తీశాడు. అలా.. ఈ విషయం బయటకొచ్చింది. తోట యాజమాని ప్రశ్నిస్తుంటే.. బాలికను స్కూటర్‌పై ఎక్కించుకొని అక్కడి నుంచి పరారయ్యాడు నారాయణరావు. బాలిక బంధువుల ఫిర్యాదుతో.. నారాయణరావును అదుపులో తీసుకున్నారు పోలీసులు. న్యాయం కోసం గురుకుల పాఠశాల ఎదుట బాలిక బంధువులు ఆందోళనకు దిగారు.


నిందితుడి పై పోక్సో కేసు

ఈ ఘటనపై.. మంత్రి నారా లోకేశ్ కూడా స్పందించారు. నిందితుడు నారాయణరావుపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని ట్వీట్ చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వాళ్లని ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు. బాధితురాలు ధైర్యంగా ఉండేలా కౌన్సిలింగ్ ఇచ్చి, అన్నివిధాలా సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థినులకు పటిష్ట భద్రత కల్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

ఇలాంటి ఘటనలు మరెన్నో

ఇదే రోజు.. రాజమండ్రిలో మరో దారుణం జరిగింది. సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న బాలికపై అజయ్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికని ట్రాప్ చేసి పుష్కర ఘాట్‌కు తీసుకెళ్లాడు. మాయమాటలు చెప్పి.. అక్కడి నుంచి లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు అజయ్. బాలిక ఫిర్యాదుతో.. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఈ రెండు దారుణాలే కాదు.. ఇదే నెలలో.. ఏపీలో అనేక చోట్ల మైనర్లపై ఇలాంటి అఘాయిత్యాలు ఎన్నో జరిగాయ్. కృష్ణా జిల్లా ఉయ్యూరులో మైనర్ బాలికపై.. వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

కన్న కూతురిపై మద్యం మత్తులో ఉన్న తండ్రి అత్యాచారం

నరసాపురంలో అయితే మరీ దారుణం. ఉపాధి నిమిత్తం తల్లి గల్ఫ్ వెళ్లింది. ఇంటి దగ్గరే ఉండి చదువుకుంటున్న కన్న కూతురిపై.. మద్యం మత్తులో ఉన్న తండ్రి జులైలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఇటీవల.. తల్లి గల్ఫ్ నుంచి తిరిగి వచ్చినప్పుడు బాలిక తనపై జరిగిన అఘాయిత్యం గురించి చెప్పింది. దాంతో.. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

నల్గొండ

నల్గొండలోనూ మైనర్ బాలికపై అత్యాచారం చేసి.. హత్య చేశారు ఇద్దరు యువకులు. నల్గొండలో కాలేజీకి వచ్చిన బాలిక.. డీఈవో ఆఫీస్ దగ్గర ఆటో దిగింది. ఆమెని.. బైక్‌పై ఎక్కించుకొని రూమ్ దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ కృష్ణ అనే యువకుడు అత్యాచారం చేయడంతో.. తీవ్ర రక్తస్రావమై బాలిక చనిపోయింది. నిందితులిద్దరిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

చిత్తూరు

చిత్తూరులోనూ మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారం చేశారు. అల్లూరి జిల్లాలోనూ గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం చేశారు ఇద్దరు యువకులు. గిరిజన పాఠశాలలో చదువుతున్న బాలికను.. లంబసింగి నుంచి తీసుకెళ్లి విశాఖలో మూడు రోజుల పాటు అత్యాచారం చేశారు.

విజయవాడ

విజయవాడ పక్కనున్న నున్నలోనూ ఇలాంటి దారుణమే జరిగింది. మైనర్ బాలికపై.. బాబాయ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు మృతి చెందడంతో.. బాలిక.. పిన్ని, బాబాయ్ దగ్గర ఉంటోంది. ఆ అమ్మాయి అనారోగ్యంతో ఉన్నప్పుడు వైద్యపరీక్షలు చేసినప్పుడు.. గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధారించారు. దాంతో.. బాబాయ్ అత్యాచారం చేశాడని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇలా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో.. ఏదో ఒక చోట బాలికలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయ్. ఇరుగు-పొరుగు వాళ్లో, బంధువులో, ఇంట్లోని వారో.. ఎవరో ఒకరు.. మన చుట్టూ ఉన్నవాళ్లే.. వావీ వరుసలు మర్చిపోయి, చిన్నారులని కూడా చూడకుండా తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. ఎందరో బాలికల జీవితాలను నాశనం చేస్తున్నారు. ఈ తరహా ఘటనలు.. అందరి మనసుల్ని కలచివేస్తున్నాయ్. సమాజం పట్ల తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయ్.

అభం, శుభం తెలియని చిన్నారులపై లైంగిక దాడులకు ప్రయత్నించడం.. అత్యంత హేయమైన, క్షమించరాని నేరం. ఈ తరహా అఘాయిత్యాలు.. ఆ చిన్నారుల మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయ్. అందుకే.. నిందితుల వయస్సుతో సంబంధం లేకుండా.. కఠినమైన చర్యలు తీసుకోవాలనే వాదనలు వినిపిస్తున్నాయ్. అఘాయిత్యం జరిగాక ఏం చేయాలనే దానికంటే ముందు.. ఇలాంటివి జరగకుండా చూసుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

బూచాళ్లు ఉన్నారు జాగ్రత్త

ఈ సమాజంలో మహిళలకే కాదు బాలికలకు కూడా భద్రత లేదు. తాత వయసున్న వ్యక్తి.. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడడం.. ఎంతో దారుణం. ఇదొక్కటే కాదు.. వరుసకు మామయ్యే వాడు, బాబాయ్‌గా చలామణీ అయ్యేవాడు, చెల్లిగా పిలిచేవాడు, కూతుర లాంటిదని చెప్పేవాడు.. ఇలా ఎంతోమంది బూచాళ్లు మన చుట్టూనే ఉంటారు. ఏదో ఒక రోజు వాళ్లే తమ కామవాంఛ తీర్చుకునేందుకు.. చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఈ తరహా ఘటనలు.. మన చుట్టూ ఉన్న వ్యక్తులపై నమ్మకం కోల్పోయేలా చేస్తున్నాయ్. లైంగిక వేధింపులకు, అఘాయిత్యాలకు, వయసు, బంధుత్వం, వావీవరుసలనేవి అడ్డుకాదని.. ప్రతిరోజూ.. రుజువవుతూనే ఉంది. ఇలాంటి బూచాళ్లు ఇంటి చుట్టుపక్కలే కాదు.. ఇంటికి దూరంగా చదువుకుంటున్న గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల చుట్టూ కూడా తిరుగుతున్నారు. ఇలాంటి ఘటనలు అక్కడ కూడా జరగడం.. తల్లిదండ్రులు, సమాజం.. పాఠశాలలపై ఉంచిన నమ్మకాన్ని దెబ్బతీస్తోంది.

ఇలా చెప్పవలసిన బాధ్యత తల్లిదండ్రులదే !

తుని ఘటనతో.. గురుకుల పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు ఎంత భద్రత ఉందనే చర్చ మొదలైంది. సాధారణంగా, గురుకుల పాఠశాలలు మెరుగైన విద్యతో పాటు, వసతి, భద్రత కల్పిస్తాయని తల్లిదండ్రులు నమ్ముతారు. కానీ, అప్పుడప్పుడు జరిగే ఇలాంటి ఘటనలు ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాయ్. బాలికలకు రక్షణ కల్పించాల్సిన వ్యవస్థ.. ఈ విషయంలో వైఫల్యం చెందింది. అందుకే.. మన ఇంట్లో ఆడపిల్లలకు.. సొసైటీలో ముసుగు కప్పుకొని తిరిగే బూచాళ్ల గురించి వివరంగా చెప్పాల్సిన అవసరముందనే వాదనలు వినిపిస్తున్నాయ్. మన చుట్టూ సాధారణ వ్యక్తులుగా కనిపించే వారే.. ఈ తరహా అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. అయితే.. బాలికలు, వారి తల్లిదండ్రులే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది గుడ్ టచ్.. ఏది బ్యాడ్ టచ్.. ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు? ఎవరికి దూరంగా ఉండాలి? ఎవరితో ఎలా మెలగాలి? ఎవరిని నమ్మాలి? ఎవరితో వెళ్లాలి? అనే విషయాలను.. వివరించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే! అనే చర్చ జరుగుతోంది. చిన్నప్పటి నుంచే.. బాలికలకు తమ శరీరంపై పూర్తి హక్కు ఉందని.. ఎవరైనా అసభ్యంగా తాకినా, మాట్లాడినా.. అది బ్యాడ్ టచ్, బ్యాడ్ అప్రోచ్ అనే విషయాలను నేర్పించాలి. ఎవరైనా అసౌకర్యంగా అనిపించేలా ప్రవర్తిస్తే.. ఎంత పెద్దవారైనా సరే.. వెంటనే వద్దని చెప్పే ధైర్యాన్ని నూరిపోయాలి. భయపెట్టో, బెదిరించో.. రహస్యంగా ఉంచాలని చెప్పడమో, ఎవ్వరికీ చెప్పొద్దని చెప్పడమో చేస్తే.. అది ఎంత పెద్ద రహస్యమైన తల్లిదండ్రులకు చెప్పాలని ప్రోత్సహించాలి.

ప్రతీ రోజు తల్లిదండ్రులు పిల్లలకు అడగవలసిన ప్రశ్నలు?

తల్లిదండ్రులు.. చిన్నారులను స్నేహపూర్వక వాతావరణంలో ప్రతిరోజూ మాట్లాడాలి. వారి దినచర్యతో పాటు స్కూల్లో జరిగిన విషయాలను అడగాలి. అప్పుడే.. పిల్లలు అన్ని విషయాలు పంచుకోగలుగుతారు. ఇక.. బాలికల ప్రవర్తనలో వచ్చే మార్పులను కూడా పేరెంట్స్ గమనిస్తుండాలి. పిల్లలు ఒక్కసారిగా మౌనంగా మారడం, ఎక్కువగా చిరాకుపడటం, ఏడవటం, నిద్రలో ఉలిక్కిపడటం, భయపడటం లాంటివి చేస్తే.. అనుమానించాల్సిందే. స్కూల్‌కు, హాస్టల్‌కు వెళ్లేందుకు ఇష్టపడకపోవడం, ఎవరితోనైనా మాట్లాడటానికి భయపడటం, ఎవరినైనా చూసి దాక్కోవడం లాంటివి చేయడం చూస్తే.. వెంటనే ఆరా తీయాలి. శరీర భాగాలపై గాయాలు, నొప్పులు ఉన్నాయా? అనేది కూడా గమనించాలి. పాఠశాలల్లో ఉన్న భద్రతా వ్యవస్థ, సీసీ కెమెరాలు గురించి వివరాలు తీసుకోవాలి. పాఠశాలలో ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే.. వెంటనే స్కూల్ యాజమాన్యానికి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదుల స్వీకరణకు, తక్షణ చర్యలకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. చిన్నారులపై ఈ తరహా దాడులను నివారించాలంటే.. కేవలం శిక్షలు వేయడం మాత్రమే కాదు.. సమాజంలో పటిష్టమైన భద్రత, లైంగిక విధ్య, ఫిర్యాదుల వ్యవస్థని మెరుగుపరచాల్సిన అవసరం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయ్. ఇవన్నీ సరిగ్గా అమలు జరిగితే.. చిన్నారులకు భద్రత పెరుగుతుంది. కానీ ఆచరణలో లోపాలు కనిపిస్తున్నాయి.

Story by Anup, Big Tv

Related News

Bihar Elections: గెలుపు కోసం ఆరాటం.. వరాల జల్లు కురిపిస్తోన్న రాజకీయ పార్టీలు, బీహార్ ప్రజల తీర్పు ఏమిటో?

Bhimavaram: భీమవరం పేకాట.. నడిపించింది ఎవరు?

Palnadu Politics: పల్నాడు నెత్తుటి కథ.. తప్పెవరిది?

Paritala Sriram vs Kethireddy: లైట్ తీసుకున్నారా ? కేతిరెడ్డిపై పరిటాల ప్లానేంటి?

Louvre Museum: ‘మనీ హీస్ట్’ సీరిస్ స్టైల్‌లో మ్యూజియంలో చోరీ.. జస్ట్ 7 నిమిషాల్లోనే పని కానిచ్చేసిన దొంగలు, ఇదిగో ఇలా!

Jubilee Hills By Election: జూబ్లిహిల్స్ ఉపఎన్నిక.. బీఆర్ఎస్ గట్టెక్కుతుందా?

Google In Vizag: ట్రెండ్ క్రియేట్ చేయబోతున్న వైజాగ్ ఏఐ హబ్‌.. మరి ఉద్యోగాలు?

Big Stories

×