BigTV English

Chiranjeevi : చిరు కేసుపై కోర్టు షాకింగ్ తీర్పు.. ఇకపై ‘మెగాస్టార్’ ట్యాగ్ వాడొద్దు..

Chiranjeevi : చిరు కేసుపై కోర్టు షాకింగ్ తీర్పు.. ఇకపై ‘మెగాస్టార్’ ట్యాగ్ వాడొద్దు..
Advertisement

Chiranjeevi : టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవికి కోర్టులో తీర్పు అనుకూలంగా వచ్చింది. మెగాస్టార్ కు కోర్టు ఇచ్చిన తీర్పు పై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. వాణిజ్య ప్రయోజనాల కోసం ఆయన పేరు, బిరుదులు, చిత్రాలు, ఫోటోలను ఉపయోగించకుండా ఆన్‌లైన్ గార్మెంట్స్ సంస్థలు, డిజిటల్ మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెళ్లు, ఇతర సంస్థలను నిరోధిస్తూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కోర్టు విచారణ జరిపింది. కోర్టు చిరంజీవి వ్యక్తిత్వ ప్రచార హక్కులకు రక్షణ కల్పించింది.. ఆయన పేరును వాణిజ్య దోపిడీ నుంచి కాపాడాలని కోరుతూ చిరంజీవి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఆయనకు ఊరట కలిగించింది…


‘మెగాస్టార్ ‘ ట్యాగ్ వాడితే కఠిన చర్యలు.. 

మెగాస్టార్ అంటే అందరికి ఒకరమైన ఎనర్జీ వస్తుంది. ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందరివాడు మన మెగాస్టార్ అని అనుకుంటారు. అలాంటిది ఇప్పుడు మెగాస్టార్ బిరుదు కూడా వాడుకోవద్దు అంటే కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ మెగాస్టార్ పేరును కొంత మంది చెడుగా ఉపయోగిస్తున్నారు. మరి కొంత అయితే… తప్పుడు పనులకు కూడా మెగాస్టార్ పేరును వాడుతున్నారు. దీని వల్ల మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టకు భంగం కలుగుతుంది. అందుకే తన అనుమతి లేకుండా మెగాస్టార్ బిరుదు కానీ, ఫోటో కానీ, వాయిస్ గానీ వాడొద్ద అని హైదరాబాద్ సివిల్ కోర్టులో పిటిషన్ వేశాడు. నేడు కోర్టులో విచారణ జరిగింది. చిరంజీవికి ఊరటనిచ్చేలా తీర్పును ఇచ్చింది. ఇక మీదట చిరంజీవి అనుమతి లేకుండా వాణిజ్య లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా నిషేధించింది. ఈ అనధికార వినియోగం వల్ల చిరంజీవి ప్రతిష్టకు పూడ్చలేని నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి మెగాస్టార్ అనే ట్యాగ్ ను కూడా వాడొద్దని తీర్పును ఇచ్చింది. అనంతరం ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను అక్టోబర్ 27కు వాయిదా వేసింది.. ఇలాంటి ఫిటిషన్ ను కేవలం చిరంజీవి మాత్రమే కాదు.. గతంలో పలువురు స్టార్ హీరోలు సైతం కోర్టుని ఆశ్రయించారు.

Also Read :అనారోగ్యంతో హౌస్‌ నుంచి ఈ కంటెస్టెంట్ అవుట్.. పాపం అస్సలు ఊహించలేదు..


మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే.. 

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి వయసు పెరుగుతున్న కుర్ర హీరోలకి గట్టి పోటీనిచ్చేలా వరుస సినిమాలను చేస్తున్నారు. ఆయన రీయంట్రీ ఇచ్చిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటించారు. కానీ ఒకటి రెండు చిత్రాలు మాత్రమే పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను వసూల్ చేశాయి. ప్రస్తుతం మెగాస్టార్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. నయనతార ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మొన్న రిలీజ్ అయిన మీసాల పిల్ల పాట వరుసగా రికార్డులను బ్రేక్ చేస్తూ వస్తుంది. ఈ సినిమాని వచ్చేయడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ గురించి పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది..

Related News

The Girl friend: ట్రైలర్ ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

Upasana – Ramcharan : మెగా కంపౌండ్‌లో డబుల్ కన్ఫ్యూజన్.. ఈ పజిల్ వెనుక రహస్యం ఏంటి ?

Music director Death: మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూత.. అసలేం జరిగిందంటే?

Mohan Babu: బావ నువ్వు పెళ్లి చేసుకుని అర డజను మంది పిల్లలతో సంతోషంగా ఉండాలి!

The Raja Saab: అనుకున్నట్టే చేశాడు.. రాజా సాబ్‌పై మారుతిపై ఫ్యాన్స్ ఫైర్

Gummadi Narasaiah: గుమ్మడి నరసయ్యగా శివన్న.. ఆకట్టుకుంటున్న గ్లింప్స్!

Chiranjeevi:మన శంకర వరప్రసాద్ సెట్లో పెళ్లికానీ ప్రసాద్.. ఇది కదా ఇండస్ట్రీకి కావాల్సింది

Big Stories

×