Alia Bhatt Diwali Photos (Source: Instagram)
Alia Bhatt Diwali Celebrations: బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీందీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకంగా ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. ఆలియా భట్ కు ఉండే ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Alia Bhatt Diwali Photos (Source: Instagram)
అక్కడ ఎన్నో చిత్రాల్లో నటించి హిట్స్, సూపర్ హిట్స్ అదుకుంది. తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. స్టార్ కిడ్ గా బాలీవుడ్లో అడుగుపెట్టిన ఈ భామ ఆ తర్వాత తనదైన నటన, యాక్టింగ్ స్కిల్స్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది.
Alia Bhatt Diwali Photos (Source: Instagram)
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. ఈ సినిమా హిట్‌తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటు ఆడియన్స్ మనసులో స్థానంలో సంపాదించుకుంది.
Alia Bhatt Diwali Photos (Source: Instagram)
అలా అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి అత్యధిక పారితోషికం తీసుకున్ని నటుల జాబితాలో చేరింది. కాగా బాలీవుడ్ ఎన్నో సినిమాలు చేసిన ఈ భామ.. నటుడు రణ్‌బీర్ కపూర్ తో ప్రేమలో పడింది.
Alia Bhatt Diwali Photos (Source: Instagram)
తన డ్రీం బాయ్‌తోనే ప్రేమలో పడి అతడినే పెళ్లాడింది ఈమె. 2022 లో రణ్ బీర్ కపూర్‌తో ఏడగుగులు వేసిన ఆలియా పెళ్లయిన ఐదు నెలలకే బిడ్డకు జన్మనిచ్చింది. వారికి రహా కూతురు జన్మిచ్చింది.
Alia Bhatt Diwali Photos (Source: Instagram)
పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించిన ఆలియా నిర్మాతగా మారింది. ఆడపదడప సినిమాలు చేస్తూనే.. సినిమాలు నిర్మిస్తోంది. తాజాగా దీపావళి ఫోటోలు షేర్ చేసింది. భర్త రణ్‌బీర్, డైరెక్టర్ ఆయాన్ ముఖర్జీతో, ఫ్యామిలీతో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకుంది.
Alia Bhatt Diwali Photos (Source: Instagram)
ఇందుకు సంబంధించిన ఫోటోలు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. బేబీ పింక్, లైట్ పిస్తా గ్రీన్ కాంబినేషన్లో ట్రేడిషనల్ లుక్‌లో కనిపించింది. అయితే ఇందులో ఆలియా భిన్నమైన వస్త్రాధారణతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
Alia Bhatt Diwali Photos (Source: Instagram)
బేబీ పింక్ షీర్ కుర్తా.. ప్లెటెడ్ స్కర్ట్ లో ఆలియా ఆకట్టుకుంది. ఈ దిపావళికి విభిన్న లుక్‌లో ఆలియా బుట్టబొమ్మలా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా ఆలియా ఫ్యాషన్‌కి మారుపేరు అనే విషయం తెలిసిందే.
Alia Bhatt Diwali Photos (Source: Instagram)
అకేషన్ తగ్గట్టుగా తన డ్రెస్సింగ్ స్టైల్ ఉండేలా జాగ్రత్త పడుతుంది. అంతేకాదు అందరికి కంటే భిన్నంగా స్టైలిష్‌గా తన వస్త్రాధారణ ప్లాన్ చేసుకుంది. అలా ఈ దీపావళికి డిఫరెంట్ డిజైనర్‌ని ఫ్యాన్స్ కి పరిచయం చేసింది. ప్రస్తుతం ఆలియా లుక్ నెటిజన్స్, ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.