TS EAPCET Hall Tickets: ఇంటర్ పూర్తి చేసి టీఎస్ ఎప్‌సెట్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థలకు బిగ్ అలర్ట్. తెలంగాణలో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న టీఎస్ ఎప్‌సెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి.
తెలంగాణలో టీఎస్ ఎప్‌సెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి.. ఫార్మసీ విభాగానికి చెందిన హాల్ టికెట్లను అధికారులు తాజాగా విడుదల చేశారు. అయితే ఇంజినీరింగ్ స్ట్రీమ్ కు సంబంధించిన హాల్ టికెట్లను మే నెల 1వ తేదీన విడుదల చేస్తామని సెట్ నిర్వాహకులు వెల్లడించారు.
విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి టీఎస్ ఎప్ సెట్ హాల్ టికెట్లను ఆన్ లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి చెందిన పరీక్షలు జరగనున్నాయి. మే 9, 10, 11వ తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి.
Also Read: తెలంగాణలో పదోతరగతి ఫలితాలు.. ఎప్పుడంటే?
ఈ ఏడాది టీఎస్ ఎప్ సెట్ కు మొత్తంగా దాదాపు 3.54 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారిలో అగ్రికల్చర్, ఫార్మా విభాగానికి 1,00,260 మంది దరఖాస్తు చేసుకోగా.. మిగిలిన వారు ఇంజినీరింగ్ విభాగానికి దరఖాస్తు చేసుకున్నారు. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నావారు eapcet.tsche.ac.in అనే ప్రభుత్వ వెబ్ సైట్ ను సంప్రదించాలని సెట్ నిర్వాహకులు వెల్లడించారు.