BigTV English

Johnny Master : రంగంలోకి దిగిన మహిళా సంఘాలు… జానీ మాస్టర్ కి ఇక జాతరే..

Johnny Master : రంగంలోకి దిగిన మహిళా సంఘాలు… జానీ మాస్టర్ కి ఇక జాతరే..

Johnny Master.. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Johnny master) తాజాగా కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నారు. మహిళా సంఘాలు ఈయనపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ రంగంలోకి దిగారు. అసలు విషయంలోకి వెళ్తే.. జానీ మాస్టర్ 2017 నుంచే జూనియర్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు.. బాధిత యువతి తాజాగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, ఈ కేస్ నార్సింగి ప్రాంతానికి సంబంధించింది కావడంతో రాయదుర్గం పోలీసులు సెప్టెంబర్ 15 మధ్యాహ్నం సమయంలో జీరో ఎఫ్ ఐ ఆర్ ను నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అనంతరం విచారణ చేపట్టిన సిఐ హరికృష్ణ రెడ్డి జానీ మాస్టర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


లైంగిక దాడికి పాల్పడిన జానీ మాస్టర్..

బాధితురాలని విచారించాలని చూసిన పోలీసులకు ఆమె షాక్ ఇచ్చిందని చెప్పాలి.ప్రస్తుతం తాను పోలీసుల ముందుకు రాలేనని చెప్పడంతో పోలీసులు ఆమెను నార్సింగి లోని తన నివాసానికి వెళ్లి దాదాపు మూడు గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం విస్తుపోయే నిజాలు బయటపెట్టారు పోలీసులు. ఒక ప్రముఖ ఛానల్ లో, డాన్స్ షో లో భాగంగా 2017 లో జానీ మాస్టర్ తో పరిచయం ఏర్పడిందని , ఆ తర్వాత ఆయన అసిస్టెంట్స్ ఇద్దరు తనకు ఫోన్ చేసి తమ టీం లో జాయిన్ అవ్వాలని కోరినట్లు తెలిపింది. ఇక తర్వాత ఒక షోలో భాగంగా ముంబై కి వెళ్ళగా అక్కడ బస చేసిన హోటల్లో తనపై లైంగిక దాడి చేసి , చిత్రవధకు గురి చేశాడని జానీ మాస్టర్ పై కామెంట్లు చేసింది. అంతేకాదు బహిరంగంగా తనపై దాడి చేశాడని, అసభ్యకర కామెంట్లు చేశారని , మతం మార్చుకుని పెళ్లి చేసుకోమని బెదిరించాడు అంటూ కూడా తెలిపింది.


Johnny Master: Women's organizations that have entered the field... No more fairs for Jani Master..!
Johnny Master: Women’s organizations that have entered the field… No more fairs for Jani Master..!

బాధిత యువతికి అండగా మహిళా సంఘాలు..

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సెలబ్రిటీలు కూడా జానీ మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ద్వారా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మహిళా సంఘాలు కూడా బాధిత యువతకి అండగా నిలిచాయి. బుద్ధ భవన్లో తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదను మహిళా సంఘ సభ్యులు కలిశారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేస్తూ మహిళల మీద లైంగిక వేధింపుల అంశంలో జానీ మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ చైర్ పర్సన్ వారు కోరారు. ఇకపోతే మహిళా సంఘాలు రంగంలోకి దిగాయి అంటే మరి జానీ మాస్టర్ పరిస్థితి ఏంటో అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

జానీ మాస్టర్ పై ఫైర్ అవుతున్న సెలబ్రిటీస్..

ఇదిలా ఉండగా తాజాగా జానీ మాస్టర్ పై అనసూయ ను మొదలుకొని పూనమ్ కౌర్ , చిన్మయి ఇలా చాలామంది సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జానీ మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే దీనిపై స్పందించిన జానీ మాస్టర్ తనపై కావాలని కుట్రపన్ని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, తనకు ఏ పాపం తెలియదని, సాక్షాదారాలు నిరూపణ అయితే తనను నిరభ్యంతరాయంగా శిక్షించవచ్చు అంటూ చెబుతున్నారు. మరి నిజా నిజాలు తెలియజేసే వరకు వేచి ఉండాల్సిందే.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×