BigTV English
Advertisement

JD Chakraborty: అవకాశం కావాలంటే పక్క పంచాల్సిందే.. జే.డీ.బోల్డ్ స్టేట్మెంట్ వైరల్..!

JD Chakraborty: అవకాశం కావాలంటే పక్క పంచాల్సిందే.. జే.డీ.బోల్డ్ స్టేట్మెంట్ వైరల్..!

JD Chakraborty.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సెన్సేషన్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకత్వంలో వచ్చిన శివ (Shiva ) చిత్రం ద్వారా విలన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయిన జే.డీ.చక్రవర్తి ఆ తర్వాత పలు చిత్రాలలో హీరోగా కూడా నటించి తెలుగు ఆడియన్స్ కు దగ్గరయ్యారు. ఎక్కువగా తమిళ్ చిత్రాలలో నటించిన ఈయన ఇటీవలే చాలా కాలం తర్వాత దయా అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకున్నారు. ఇదిలా ఉండగా మొదటిసారి క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించి అందరిని ఆశ్చర్యపరిచారు జెడి చక్రవర్తి. హీరోయిన్ కి అవకాశం కావాలి అంటే నిర్మాత పక్కలోకి వెళ్లాలి అంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు.


జస్టిస్ హేమా నివేదికతో గుట్టురట్టు..

మలయాళం సినీ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పైన జస్టిస్ హేమా కమిటీ నివేదిక బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇండస్ట్రీలో మహిళా నటీమణులు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని, దోపిడీకి గురవుతున్నారని, ఆ నివేదికలో వెల్లడించడం జరిగింది. అమానవీయ ప్రవర్తనకు బాధితులుగా ఉన్నారని స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు ఈ నివేదిక మలయాళ ఇండస్ట్రీలోనే కాదు నివేదిక బయటకు వచ్చిన తర్వాత అన్ని ఇండస్ట్రీలలో కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. చాలామంది బాధిత నటీమణులు ధైర్యంగా ముందుకొచ్చి ఇప్పుడు తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి దారుణాలపై జేడీ చక్రవర్తి ఆశ్చర్యకర కామెంట్లు చేశారు.


అవకాశం కావాలంటే పక్కలోకి వెళ్లాల్సిందే..

JD Chakraborty: If you want a chance, you have to share.. JD's bold statement is viral..!
JD Chakraborty: If you want a chance, you have to share.. JD’s bold statement is viral..!

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అవసరం , అవకాశాల కోసం కొంతమంది హీరోయిన్లు తప్పని పరిస్థితుల్లో అలాంటి కమిట్మెంట్ కి ఒప్పుకుంటున్నారే తప్పా.. కావాలని ఎవరు అలాంటి పని చేయరు అంటూ ఆశ్చర్యకర కామెంట్లు చేశారు.. ఒక ఉదాహరణ చెబుతూ తాను చూసిన ఘటన కూడా అందరితో పంచుకున్నారు. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఒక హీరోయిన్ నన్ను గెస్ట్ హౌస్ కి రమ్మని పిలిచింది. అయితే నేను , నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్తే హాల్లో కూర్చోగా .. కాలింగ్ బెల్ మోగింది. అయితే వెంటనే ఆ హీరోయిన్ మమ్మల్ని దాక్కోమని బలవంతం చేసింది. అప్పుడు నాకు అర్థం కాలేదు. ఆ రాత్రి సమయంలో ఒక ఓల్డ్ ప్రొడ్యూసర్ వచ్చారు. ఆ ప్రొడ్యూసర్ కి తాత వయసు ఉంటుంది. అయితే ఆ ముసలోడు ఆ అమ్మాయితో మాట్లాడిన మాటలు చాలా నీచంగా అనిపించాయి . ఆ హీరోయిన్ మాత్రం నవ్వుతూ కనిపించినప్పటికీ , ఆ ముసలోడు అన్న మాటలకు నేను, నా ఫ్రెండు ఏడ్చేసాము. ఆ ముసలోడు ప్రవర్తించిన తీరు మాకు నచ్చలేదు. వాడు ముసలోడు రా.. అమ్మాయి వాసన చూస్తున్నాడు..అంటూ నా ఫ్రెండ్ అన్నాడు.. మేమేం చేస్తాం తప్పదు వాడు పెద్ద ప్రొడ్యూసర్ మరి అంటూ సంచలన విషయాలు బయట పెట్టారు.

తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తోంది..

నిజానికి ఏ అమ్మాయి కూడా ఇలా వెళ్లదు. అయితే మేము చూసిన అమ్మాయి తెలివైనది కాబట్టి అక్కడి నుంచి మేనేజ్ చేసి తప్పించుకుంది. ఏ అమ్మాయిని అయినా సరే వాడుకొని అవకాశం ఇస్తే ఆమె కూడా మంచిగా ఫీలవుతుంది. కానీ అవకాశం ఇవ్వకుండా వాడుకొని వదిలేస్తే మాత్రం వారిపై పగబడుతుంది అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. జె డి చక్రవర్తి ముఖ్యంగా కమిట్మెంట్ ఇవ్వకపోతే ప్రొడ్యూసర్లు , డైరెక్టర్లు చాలా దారుణంగా టార్చర్ చేస్తారు. ముఖ్యంగా వారిని టార్గెట్ చేస్తూ ఈ మూమెంట్ సరిగ్గా లేదు, ఫోకస్ లేదు.. మూమెంట్ చేయడం రాదా అంటూ సెట్లోనే అందరి ముందు అవమానిస్తారు అంటూ తెలిపారు. ముఖ్యంగా అవుట్డోర్ షూటింగ్స్ లో అయితే హీరోయిన్స్ కమిట్మెంట్ గురించి అడగకముందే పెద్ద పెద్ద హీరోలు నిర్మాతలు డైరెక్ట్ గా వారి రూముల్లోకి వెళ్లిపోయి వారిని టార్చర్ చేస్తారు అంటూ జేడీ చక్రవర్తి ఇండస్ట్రీలో జరిగే విషయాలను బయటపెట్టారు.

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×