BigTV English

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Sensational War on YS Jagan Declaration: తిరుమల శ్రీవారి ఆలయ దర్శనానికి మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాక పోవడానికి కారణం డిక్లరేషన్ ఇవ్వాల్సివస్తుందనే అంటున్నారు కూటమి నేతలు.. వైసీపీ నేతలు మాత్రం తమ నాయకుడి మీద దాడి జరిగే అవకాశం ఉండటంతో రాలేదని.. అసలు ఇదేమి సెక్యూలరిజ్.. ఇదేమి ప్రజా స్వామ్యం అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మొత్తం మీద రెండు రోజుల పాటు జగన్ తిరుమల యాత్ర ఇష్యూతో డిక్లరేషన్ ప్రాధాన్యత అందరికీ తెలిసి వచ్చిందంటున్నారు. అలాగే లడ్డూ కల్తీ ఇష్యూని డైవర్ట్ చేయడానికే వైసీపీ హైడ్రా ఆడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.


దక్షిణ భారత దేశంలోని చాలా దేవాలయాలలో అన్యమతస్థులకు ప్రవేశం లేదు. తమిళనాడు హైకోర్టు సైతము పలు కేసులలో అదే ప్రకటించింది. దేవాలయాలు టూరిస్టు స్పాట్లు కాదు. ఖచ్చితంగా నమ్మకం ఉందని ప్రకటించిన వారినే అనుమతించాలి.. చాలా మంది ప్రముఖులు తమిళనాడు ,కేరళలతో పాటు అనేక దేవాలయాలలో ప్రవేశం కోసం ఇబ్బంది పడ్డ సందర్భాలున్నాయి. తిరుమల వచ్చినప్పుడు మాజీ ప్రెసిడెంట్ అబ్దుల్‌కలాం కూడా డిక్లరేషన్ సమర్పించారు. ఆ క్రమంలో తాజాగా జగన్ తిరుమల యాత్ర సిద్దం అయిన తర్వాత డిక్లరేషన్ అంశం బహిరంగ చర్చకు దారి తీసింది.

గత ఐదు సంవత్సరాల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను వైసీపీ దెబ్బ తీసిందని టిడిపితో పాటు మిత్రపక్షాలు అరోపిస్తున్నాయి. నాటి అవకతవకలు, అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వయిరీ నడుస్తోంది.ఆ క్రమంలో తిరుమ ల శ్రీవారి ప్రసాదాలకు వినియోగించే ఆవు నెయ్యిలో జంతువుల కొవ్వును కల్తీ చేసారనే అంశం బయటపడింది. ఎఅర్ డైరీ ద్వారా పది ట్యాంకర్ల నెయ్యి జూన్, జూలై నెలలో తిరుమలకు వచ్చింది. అందులో అరు ట్యాంకర్ల వినియోగం జరిగింది. మరో నాలుగు ట్యాంకర్లలో నెయ్యిని పరీక్షలకు పంపితే కల్తీ వ్యవహారం బయట పడిందని ఈఓతో పాటు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.


కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. తిరుమల ఆలయంలో శాంతి హోమం, ప్రక్షాళన కార్యక్రమాలు నిర్వహించారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేయడంతో పాటు అక్టోబర్ 1నుంచి మూడోవ తేది వరకు తిరుమలలో ఉంటానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ కూడా రాష్ట వ్యాప్తంగా దేవాలయాలలో పూజలు చేయమని తన పార్టీ శ్రేణులకు అదేశాలు ఇవ్వడంతో పాటు తాను కూడా తిరుమల పర్యటన పెట్టుకున్నారు.

Also Read: జగన్ తిరుమల టూర్ రద్దుకు కారణాలు ఇవేనా… కూటమికి ఛాన్స్ ఇచ్చినట్టేనా ?

ఎప్పుడైతే జగన్ తిరుమల పర్యటన అన్నారో కూటమి నేతలు, సాధు పరిషత్ సభ్యులు, హిందూ ధార్మిక సంఘాలు డిక్లరేషన్ అంశాన్ని తెరమీదకు తెచ్చాయి. దానిపై పెద్ద ఎత్తున చర్చలు నడిచాయి. అసలు డిక్లరేషన్ ఇవ్వం గాక ఇవ్వం ఏమి చేస్తారు మీరు అడిగితే ఇవ్వాలా అంటు మాజీ టిటిడి బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. రెండు సార్లు చైర్మన్‌గా, మూడు సార్లపాలక మండలిసభ్యుడిగా పనిచేసిన అయన తాను పనిచేసిన టీటీడీ నిబంధనలు తానే ధిక్కరిస్తూ మాట్లాడారు.

అయితే దానిపై దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సీరియస్‌గా స్పందించారు. నిబందనలు అందరికి ఓకే విదంగా ఉంటాయని ఖచ్చితంగా డిక్లరేషన్ ఇస్తేనే రానిస్తామని… లేక పోతే అడుగు పెట్టనివ్వమని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. దీనికితోడు టీటీడీ కూడా సీఅన్యమతస్థులకు దేవుని పైన నమ్మకము ఉంటే డిక్లరేషన్ ఇచ్చి ఆలయంలోకి రావాలని.. తిరుమల హిందు దేవాలయం అని స్పష్టం చేస్తూ తిరుమలలో బోర్డులు పెట్టింది.

జగన్ తిరుమల వస్తే అడ్డుకుంటామని ప్రకటించిన కూటమి నేతలు, సాధు పరిషత్ సభ్యులు తర్వాత దాన్ని విరమించుకున్నట్లు ప్రకటించారు. అయినా జగన్ తన పర్యటన రద్దు చేసుకున్నట్లు చెబుతూ తన మీద దాడికి బిజెపి సిద్దమైందని ఇతర రాష్టాల నుంచి వేలాది మందిని పిలిపించుకుందని అరోపించారు. ఇదే విషయాన్ని కరుణాకర్ రెడ్డి, మాజీ డిప్యూటి సీఎం నారాయణ స్వామి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి సైతం చెప్పారు. చెవిరెడ్డి ఓ అడుగు ముందుకు వేసి ఇంటలిజెన్స్ నుంచి తనకు సమాచారం ఉందని జగన్మోహన్ రెడ్డి పై కోడి గుడ్ల దాడి జరగబోతుందని సమాచారం ఉండటంతో వాయిదా వేసుకున్నామని స్పష్టం చేశారు. అయితే డిక్లరేషన్ ఇవ్వమని అడిగితే ఇలాంటి కాకమ్మ కథలు చెబుతున్నారని కూటమి నేతలు విమర్శిస్తున్నారు.

అదలా ఉంటే కూటమి నేతలు మాత్రం డిక్లరేషన్ అంశాన్ని ఎస్టాబ్లిస్ చేయడంలో సక్సెస్ అయ్యారంటున్నారు. జగన్ ఇష్యూతో టీటీడీ అధికారులు సైతం ఇంత కాలం లేనిది ప్రకటన బోర్డులు పెట్టారు. అన్యమతస్తులు రావాలంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలని స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద రెండు రోజుల పాటు యావత్తు దేశ ప్రజలకు డిక్లరేషన్ పై అవగాహన ఏర్పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.

Related News

Jagan In Assembly: అసెంబ్లీలో జగన్.. ఏం మాట్లాడారో వినండి, ఇదెప్పుడు జరిగింది అధ్యక్ష!

MLCs Jump: ముగ్గురు ఎమ్మెల్సీలు జంప్.. తేలు కుట్టిన దొంగలా వైసీపీ

AP Onion Farmers: ఉల్లి రైతులకు బాబు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి రూ. 50 వేలు

Pawan Kalyan: ఏపీలో నో ప్లాస్టిక్.. పవన్ కల్యాణ్ ప్రకటన, జనసైనికులను రంగంలోకి దింపాలన్న రఘురామ!

Jagan At Banglore: యధావిధిగా బెంగళూరు మెడికల్ కాలేజీ వద్ద జగన్ ధర్నా

School Teacher: ‘D’ పదం పలకలేదని విద్యార్థిని కొరికిన టీచర్.. రాష్ట్రంలో దారుణ ఘటన

Dussehra Holidays: రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. దసరా సెలవుల్లో మార్పులు, ఎప్పటి వరకు అంటే..?

AP Gold Mines: ఏపీలో బంగారు ఉత్పత్తి.. డెక్కన్ గోల్డ్ మైన్స్ క్లారిటీ, కాకపోతే

Big Stories

×