BigTV English

Boyapati Srinu : అఖండనే ఎండ్..? బోయపాటికి ఛాన్స్ ఇచ్చే వాళ్లే లేరే…?

Boyapati Srinu : అఖండనే ఎండ్..? బోయపాటికి ఛాన్స్ ఇచ్చే వాళ్లే లేరే…?

Boyapati Srinu: ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu)మాస్ యాక్షన్ చిత్రాలకి కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఎటువంటి హీరో కైనా సరే మంచి విజయాన్ని అందించడంలో ఆయన తర్వాతే ఎవరైనా. అయితే అలాంటి ఈయన ప్రస్తుతం చతికిల పడ్డారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి బోయపాటి శ్రీను అంటే డైరెక్షన్ కి మారుపేరు. అయితే అలాంటి ఈయన నుంచి ఈమధ్య సినిమాలు రాకపోవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. బోయపాటి శ్రీనుకి అఖండ చిత్రం చివరి చిత్రం అని ప్రస్తుతం ఆయనకు అవకాశాలు ఇచ్చే వాళ్లే లేరు అని ,దీనికి కారణం రామ్ పోతినేని స్కంద మూవీ అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.


బోయపాటి తొలి సినిమా ప్రయాణం..

బోయపాటి విషయానికి వస్తే.. తెలుగు సినిమా దర్శకుడైన ఈయన తన దర్శకత్వంతో మెప్పించి.. ఏకంగా రెండు నంది అవార్డులు , రెండు టీఆర్ఎస్ జాతీయ అవార్డులు అందుకున్నారు. 2005లో రవితేజ, మీరాజాస్మిన్ కీలక పాత్రలో వచ్చిన చిత్రం భద్ర. ఈ చిత్రంతో ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమైన ఈయన మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత తులసి సినిమాతో మరో విజయాన్ని అందుకున్న బోయపాటి శ్రీను, 2010లో నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా , నయనతార, స్నేహ ఉల్లాల్ హీరోయిన్లుగా నటించిన చిత్రం సింహ. ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాదు బాలకృష్ణ లోని మాస్ ఇమేజ్ ను మళ్ళీ వెలికి తీసి సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.


అఖండ బోయపాటి చివరి సినిమా కానుందా..

Boyapati Srinu : Akhandane end..? Aren't there people who give Boyapati a chance...?
Boyapati Srinu : Akhandane end..? Aren’t there people who give Boyapati a chance…?

ఇక మళ్ళీ బాలకృష్ణతో 2014లో లెజెండ్ సినిమా తీసి మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న బోయపాటి.. ఆ తర్వాత సరైనోడు, జయ జానకి నాయక చిత్రాలతో మళ్లీ బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత రామ్ చరణ్ తో తీసిన వినయ విధేయ రామ సినిమాతో డిజాస్టర్ ను చవిచూసిన బోయపాటి శ్రీను, మళ్లీ 2021లో బాలకృష్ణతో అఖండ సినిమా తీసి అఖండమైన విజయం అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈ సినిమా సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించారు. ఆలోపు స్కంద సినిమాను తెరకెక్కించారు బోయపాటి. కానీ ఈ సినిమా ఘోరమైన పరాభవాన్ని చవిచూసింది. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు బాలకృష్ణ కూడా ఈయనకు అవకాశం ఇవ్వడానికి వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. నిజానికి బాలయ్య చేత హ్యాట్రిక్ కొట్టించిన బోయపాటి శ్రీనుకి ఇప్పుడు ఆయనే అవకాశాలు ఇవ్వకపోవడం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది అఖండ 2 వస్తుందని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నా..బాలకృష్ణ మాత్రం ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరొకవైపు స్కంద డిజాస్టర్ కావడంతో మిగతా హీరోలు కూడా బోయపాటికి ఛాన్స్ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. మొత్తానికైతే అఖండ సినిమా ఈయన చివరి సినిమా కాబోతోందనే వార్తలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. మరి దీనిపై బోయపాటి ఏదైనా స్పందిస్తారేమో చూడాలి.

Related News

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

Big Stories

×