Big Stories

TSRTC : హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త

TSRTC : తెలుగు రాష్ట్రాల్లోని బస్సు ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త తెలిపింది. వేసవికాలం నేపథ్యంలో ప్రయాణికుల ఇబ్బందులు, రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు ప్రయాణం చేసే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే దారిలో ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సును ఏర్పాటు చేసినట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ప్రకటించారు.

- Advertisement -

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లేందుకు 120కి పైగా బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. లహరి ఏసీ స్లీపర్ బస్సులు 2, నాన్ ఏసీ స్లీపర్, కమ్ సీటర్ బస్సులు 2, గరుడ ప్లస్ 9, ఈ గరుడ 10, సూపర్ లగ్జరీ 62, రాజధాని 41 బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు.

- Advertisement -

అయితే ఇందులో ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న వారికి టికెట్ పై 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇది వెళ్లడానికి, తిరిగి రావడానికి కూడా ముందస్తు బుకింగ్ చేసుకుంటే ఇదే రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు http://tsrtconline.in వెబ్ సైట్ లో టిక్కెట్ బుక్ చేసుకోవాలని సూచించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News