BigTV English

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Chiranjeevi.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగి.. నేడు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆయన ఎవరి మనసును నొప్పించడు. చాలా నెమ్మదస్తుడు.. గట్టిగా కూడా మాట్లాడలేని వ్యక్తి.. అందుకే రాజకీయాలలో బలంగా మాట్లాడలేక ఆ రంగం నుండి తప్పుకొని ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు కూడా.. ఇంతటి సౌమ్యుడు అయిన చిరంజీవి ఒకానొక సమయంలో చేసిన పనికి తెలుగు స్టార్ హీరోయిన్ సుహాసిని (Suhasini) భయపడి పోయి, తనకు గుండె ఆగిపోయినంత పని అయిందని చెప్పుకొచ్చింది. మరి ఆయన అంతలా ఈమెను ఏ విషయంలో భయపెట్టాడో ఇప్పుడు చూద్దాం..


హింసకు తాను ఇవ్వని ఏకైక వ్యక్తి.. కానీ..

అసలు విషయంలోకి వెళ్తే.. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులను తన మాటలతో నోరు మూయించేవాడు. కానీ చిరంజీవి మాత్రం ప్రత్యర్ధులతో కూడా సున్నితంగా, నెమ్మదిగా మాట్లాడేవారు. ఆ రోజుల్లో చిరంజీవికి సంబంధించిన ఏ చెడు జరిగినా సరే పవన్ కళ్యాణ్ ముందుండేవారు. అలాంటి చిరంజీవి కూడా తలుచుకుంటే ఎంత మంది రౌడీ మూకలకైనా సమాధానం చెప్పడమే కాదు తలుచుకుంటే వారందరినీ పారిపోయేలా చేయగలడు కూడా అంటూ గతంలో ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ తెలుగు స్టార్ హీరోయిన్ సుహాసిని తెలిపింది. అయితే ఆ విషయాలు ఇప్పుడు మళ్లీ వైరల్ గా మారుతున్నాయి.


భయంతో వణికిపోయాను..

చిరంజీవి గురించి సుహాసిని మాట్లాడుతూ.. నా కెరియర్లో నేను చూసిన హీరోలలో చిరంజీవి బెస్ట్ అనే చెప్పాలి. ఆయన ఎవర్గ్రీన్ హీరో. ఆయనతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించాను. అయితే ఆయన గురించి మీకు ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం చెబుతాను అంటూ చెప్పుకొచ్చింది. ఓ సినిమా షూటింగ్ నిమిత్తం మేము కేరళ కు వెళ్లాల్సి వచ్చింది. అయితే ముందు కార్లో చిరంజీవి వెళ్తుండగా.. వెనుక కారులో నేను నా స్టాఫ్ వెళ్తున్నాము. అయితే అనుకోకుండా తాగుబోతు రౌడీ మూకలు ఒక్కసారిగా మా కారును వెంబడించారు. బీరు బాటిల్స్ విసురుతూ మా కారు అద్దాలను పగలగొట్టారు. చాలా భయం వేసింది. వణికిపోయాను. అయితే ఆ రౌడీ మూకలను గమనించిన చిరంజీవి ఒక్కసారిగా కారు దిగివచ్చి.. తన జేబులో ఉన్న గన్ను రౌడీ మూకలపై గురిపెట్టి ఇక్కడ నుండి మర్యాదగా వెళ్లకపోతే ఒక్కొక్కరిని షూట్ చేసి పారేస్తాను అంటూ ధైర్యంగా బెదిరించారు. దెబ్బకు రౌడీ మూకలంతా అక్కడ నుంచి పరుగులు తీశారు.

చిరంజీవి చేసిన పనికి హాట్సాఫ్..

Chiranjeevi: Heartbroken for what he did - Telugu heroine..!
Chiranjeevi: Heartbroken for what he did – Telugu heroine..!

సాధారణంగా సినిమాలలో విలన్స్ తో పోరాడే ఈయన నిజ జీవితంలో కూడా ఇంతటి హీరోయిజం చూపించడంతో నేను ఆశ్చర్యపోయాను. ఆయన కారు దిగి వెనక్కి రాగానే.. అయ్యో ఈయనను ఏం చేస్తారో అని భయపడ్డాను. అంత మంది రౌడీలకు ఎలాంటి హింసకు తావివ్వకుండా కూల్ హీరోయిజం చూపించి వారిని పారిపోయేలా చేశారు. అయితే ఆయన గన్ను తీయగానే నా గుండె ఆగిపోయినంత పని అయింది. కానీ వారిని బెదిరించి పంపించడం చాలా సంతోషంగా అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి అయితే రియల్ హీరో అనిపించుకొని.. స్టార్ హీరోయిన్ మనసు దోచుకున్నారని చెప్పవచ్చు.

Related News

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Big Stories

×