BigTV English

Mahindra Thar 5 Doors: మహీంద్రా థార్ 5-డోర్‌‌ ముహూర్తం ఖరారు.. ధర ఎంతంటే?

Mahindra Thar 5 Doors: మహీంద్రా థార్ 5-డోర్‌‌ ముహూర్తం ఖరారు.. ధర ఎంతంటే?

Mahindra Thar 5-Door Launch Date: మహీంద్రా థార్ ఎస్‌యూవీకి మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. థార్ ఎస్‌యూవీ లాంచ్ అయినప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇందులో భాగంగానే థార్ 5-డోర్‌ను గత కొన్ని నెలలుగా తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఇప్పుడు మహీంద్రా థార్ 5-డోర్‌ కూడా విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వెహికల్ ఫీచర్లు, తదితర విషయాలను మహీంద్రా వెెల్లడించింది. వాటిపై ఓ లుక్కేయండి.


మహీంద్రా థార్ 5-డోర్ ADASతో వస్తుంది. బ్యాక్ IRVM వెనుక కెమెరా మాడ్యూల్ చూడవచ్చు. కంపెనీ ఈ ఎస్‌యూవీని మెరుగైన భద్రత ఫీచర్లతో తీసుకొస్తుంది. కొత్త గ్రిల్, LED హెడ్‌ల్యాంప్ సెటప్ ఉన్నాయి. ఇందులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ని కూడా చూడొచ్చు. వెనుక భాగంలో LED టెయిల్లాంప్, స్పేర్ టైర్‌ ఉంటుంది. థార్ 5-డోర్ కొత్త డ్యాష్‌బోర్డ్‌లో కొత్త లేఅవుట్ ఉంటుంది. అప్‌డేట్ చేయబడిన డ్యాష్‌బోర్డ్‌ కూడా ఉండొచ్చు. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్, ఎక్కువ స్టోరేజ్ స్పేస్, రూఫ్-మౌంటెడ్ స్పీకర్లు, AdrenoX కనెక్టివిటీ, 3-స్పోక్ స్టీరింగ్ వీల్ మొదలైనవి ఉన్నాయి.

Also Read: హోండా షైన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే రివ్యూ‌పై ఓ లుక్కేయండి!


థార్ 5-డోర్‌కు 3-డోర్ వెర్షన్ కంటే మెరుగైనది. ఇందులో 2.0-లీటర్ టర్బో పెట్రోల్, 2.2-లీటర్ డీజిల్ ఇంజన్‌తో ఉంటుంది. దీని పెర్ఫామెన్స్ స్కార్పియో-Nను పోలి ఉంటుంది. అందువల్ల పెట్రోల్ ఇంజన్ 200బిహెచ్‌పి పవర్, 370ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అయితే డీజిల్ ఇంజన్ 172bhp పవర్ 370Nm అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లను కలిగి ఉండవచ్చు. థార్ 5-డోర్ లాంచ్ సమయంలో 4×4 ఎంపికతో రావచ్చు. అలానే  4×2 తర్వాత ప్రారంభించే అవకాశం ఉంది.

Also Read: టీవీఎస్ అపాచీ ఫుల్ రివ్యూ.. ఇదే రియాలిటీ!

మహీంద్రా థార్ 5-డోర్లు ప్రొడక్షన్ రెడీ మోడల్‌గా కనిపిస్తుంది. మహీంద్రా ఈ SUVని ఆగస్ట్‌లో 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా లాంచ్ అయే అవకాశం ఉంది. 3-డోర్ వెర్షన్ 2020లో లాంచ్ చేశారు. ధరకు సంబంధించి థార్ 5-డోర్ అంచనా ధర రూ. 18 లక్షల నుండి రూ. 23 లక్షల మధ్య ఉండవచ్చని టాక్ వినిపిస్తుంది.

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×