Bigg Boss8 Day 17 Promo..బిగ్ బాస్ (Bigg Boss).. ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడంలో ఎప్పటికప్పుడు వినూత్నమైన టాస్క్ లను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ టాస్కుల కారణంగా కంటెస్టెంట్స్ మధ్య గొడవలు తారా స్థాయికి చేరిపోతున్నాయి. ఒకరికొకరు కొట్టుకొని చస్తారేమో అన్నంతగా చూసేవారికి అనిపిస్తోంది. ముఖ్యంగా ఒక్కొక్కరి బిహేవియర్ ఒక్కోలా అందరిని భయపెట్టేస్తున్నాయని చెప్పవచ్చు.
ఎగ్ కలెక్టింగ్ అంటూ కొత్త టాస్క్..
ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 8 ఇన్ఫినిటీ అంటూ మిగతా సీజన్ ల కంటే భిన్నంగా ఉంటుంది అంటూ సరికొత్త ఆస్తులతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా మూడవ వారం జరుగుతోంది. మూడవ వారం మూడవరోజు అనగా 17వ రోజుకు సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేయగా.. ఎగ్ కలెక్టింగ్ టాస్క్ పేరిట ఒక టాస్క్ నిర్వహించారు బిగ్ బాస్. ఎదురుగా ఒక పెద్ద కోడిపెట్టను అమర్చగా.. అందులో నుంచి గుడ్లు వస్తూ ఉంటాయి. ఎవరు ఎక్కువ గుడ్లు సేకరిస్తే వారే విజేత. అయితే ఇప్పుడు హౌస్ లో రెండు టీమ్ లుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాంతారా అంటూ అభయ్ క్లాన్, శక్తి అంటూ నిఖిల్ క్లాన్ రెండు జట్టులుగా విడిపోయి గుడ్లు సేకరించారు.
మణికంఠను తప్పించిన శక్తి క్లాన్..
అయితే ఈ గుడ్లు సేకరించే క్రమంలో కంటెస్టెంట్స్ మధ్య గొడవ తారాస్థాయికి చేరడమే కాదు , అక్కడి సన్నివేశాలు చూస్తే ఒకరికొకరు కొట్టుకొని చచ్చిపోతారేమో అన్నంతగా భయం వేస్తోందని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక తర్వాత బిగ్ బాస్ ఎవరి ప్లాన్లో ఎన్ని గుడ్లు ఉన్నాయో..? ఎవరెవరు ఎన్ని గుడ్లు సేకరించారో..? లెక్క పెట్టమని చెబుతారు. ఆ తర్వాత కాంతారా క్లాన్ నుంచి ఒక సభ్యుడిని తొలగించాలి అని, ఆ సభ్యుడిని ఎంపిక చేసే అవకాశం శక్తి క్లాన్ కి ఉంటుంది అంటూ బిగ్ బాస్ తెలిపాడు. దీంతో శక్తి క్లాన్ కాంతారా క్లాన్ నుంచి మణికంఠను తొలగించడం జరుగుతుంది.
పెళ్ళాం , బిడ్డ కావాలంటే విన్నర్ అవ్వాల్సిందే..
గేమ్ బాగా ఆడాలని కసితో హౌస్ లోకి వచ్చి, తన టాలెంట్ నిరూపించుకుంటున్న మణికంఠను శక్తి క్లాన్ తొలగించడంతో బోరున ఏడ్చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచారు మణికంఠ. అయితే అభయ్ వచ్చి ఓదార్చే ప్రయత్నం చేయగా.. నా పెళ్ళాం, బిడ్డలు కావాలంటే నేను షో విన్ అవ్వాలి. ఇప్పుడేమో నన్ను టాస్క్ నుంచి తప్పించేశారు అంటూ గట్టిగా ఎమోషనల్ అవుతూ ఏడ్చేసాడు మణికంఠ. అభయ్ నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా.. నాకంటూ ఎవరూ లేరు నాకున్నది నా భార్య బిడ్డ మాత్రమే. వారి దగ్గరికి నేను వెళ్లాలన్నా.. వాళ్లు నా దగ్గరికి రావాలన్నా.. నేను ఈ షో విన్నర్ అవ్వాలి అంటూ మరింత గట్టిగా ఏడుస్తూ చెప్పేస్తున్నాడు మణికంఠ
కన్నబిడ్డల కోసం మణికంఠ తాపత్రయం..
దీన్నిబట్టి చూస్తే తనకోసం కాదు తన బంధం, బంధుత్వం మళ్ళీ కలవాలని, తన బిడ్డ తన దగ్గరకు రావాలని, భార్య కావాలని కసితో గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయం చూసే ఆడియన్స్ ను కలచి వేసిందని చెప్పవచ్చు. మొత్తానికైతే తన బాధను మళ్ళీ చెప్పుకుంటూ అందరిని ఏడిపించేసాడు మణికంఠ. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారుతోంది.