BigTV English

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Krithi Shetty.. కన్నడ ఇండస్ట్రీకి చెందిన యంగ్ బ్యూటీ కృతి శెట్టి (Krithi Shetty) ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందు మోడల్ గా పనిచేసి, ఆ తర్వాత పలు ప్రకటనలో కూడా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత అక్కడ ఆడియన్స్ ని అలరించిన కృతి శెట్టి సినిమాలలో అవకాశాలు దక్కించుకొని తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అలా ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) శిష్యుడైన బుచ్చిబాబు సనా (Bucchibabu sana) తొలి చిత్రం ఉప్పెన (Uppena)లో అవకాశం అందుకొని.. మొదటి సినిమాతోనే ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది. అంతే కాదు ఈ సినిమా రూ .100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టడంతో ఈమెకు భారీ పాపులారిటీ లభించింది.


ఇదిలా ఉండగా ఉప్పెన సినిమా ఇచ్చిన క్రేజ్ ఈమెకు శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించి, ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదట్లోనే హ్యాట్రిక్ అందుకొని యంగ్ హీరోయిన్స్ కి రోల్ మోడల్ గా నిలిచింది. అయితే ఆ తర్వాత కాలంలో అదే దూకుడు ప్రదర్శించ లేకపోయింది కృతి శెట్టి. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి , ది వారియర్ ఇలా ఎన్నో చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో ఈమెకు అవకాశాలు రాకుండా పోయాయి. చివరిగా నాగచైతన్య తో కస్టడీ, శర్వానంద్ తో మనమే చిత్రాలు చేసింది. కానీ ఇవి కూడా డిజాస్టర్ గా నిలవడంతో ఇక టాలీవుడ్ కి శాశ్వతంగా దూరం కాబోతోంది అనే వార్తలు వినిపించగా.. తాజాగా ఏ ఆర్ ఎం అనే సినిమా లో నటించింది. ఈ సినిమా ఈమెకు చాలా రోజుల తర్వాత మళ్ళీ కం బ్యాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాలపై తాజాగా స్పందించి అందరిని ఆశ్చర్యపరిచింది.క్యాస్టింగ్ కౌచ్ పై కూడా కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది బేబమ్మ.

హేమా కమిటీ తర్వాత విస్తుపోయే నిజాలు..


మలయాళం సినీ ఇండస్ట్రీలో హేమా కమిటీ బయటకు వచ్చిన తర్వాత అన్ని ఇండస్ట్రీలలో కూడా ఈ అంశం ఓ కుదుపు కుదిపేస్తోంది. మలయాళం ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని, ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ లో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇక దీనికి తోడు తాజాగా టాలీవుడ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్ అయినా జానీ మాస్టర్(Johnny Master) పై వచ్చిన లైంగిక ఆరోపణలతో ఇండస్ట్రీలో ఈ అంశంపై తీవ్రమైన చర్చ సాగుతూ ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ అంశంపై నటి కృతి శెట్టి కూడా స్పందించినట్లు సమాచారం. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమంటూ తెలిపింది.

భయం వేస్తోంది అంటున్న కృతి శెట్టి..

Krithi Shetty: Uppena beauty's unexpected comments on sexual harassment
Krithi Shetty: Uppena beauty’s unexpected comments on sexual harassment

బాధితులు అనుభవించిన మానసిక క్షోభను తలుచుకుంటే భయం వేస్తోందని, ఇలాంటి సంఘటనల గురించి ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చేవారు ముందే తెలుసుకొని ఇండస్ట్రీలోకి రావడం చాలా మంచిదని, ముఖ్యంగా ఇండస్ట్రీ పట్ల వారికి ఒక అవగాహన ఏర్పడినప్పుడు ఇలాంటి ఇబ్బందుల నుంచి వారు బయటపడే అవకాశం ఉంటుందని, తన అభిప్రాయంగా వెల్లడించింది. అవకాశాలు కావాలి అంటే కమిట్మెంట్ ఇవ్వాలి అన్న రూల్స్ ను కొత్తవారు బ్రేక్ చేయాలని, అలా బ్రేక్ చేసేలా వారికి ట్రైనింగ్ ఇవ్వాలి అని కూడా చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ఇలాంటి విషయాలు తనను వ్యక్తిగతంగా చాలా డిస్టర్బ్ చేస్తున్నాయని, వేధింపుల వార్తలు విన్నప్పుడు ఆందోళన వేస్తోందని తెలిపింది.

కృతి శెట్టి సినిమాలు..

ఇక కృషి శెట్టి తాజాగా నటించిన చిత్రం ఏ ఆర్ ఎమ్.ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ.35 కోట్లు రాబట్టింది.

Related News

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Kissik Talks Promo : మహేష్ విట్టా లవ్ స్టోరిలో ఇన్ని ట్విస్టులా..ఆ ఒక్క కోరిక తీరలేదు..

Ritu Chaudhary : చెప్పు రీతు నువ్వు నన్ను మోసం చేయలేదా? రీతుకి కళ్యాణ్ తో బంధం తెగిపోయిందా?

Bigg boss emmanuel : నా బాధ మీకు తెలియదు, రోజు దుప్పటి కప్పుకుని ఏడుస్తాను

Siva Jyothi: గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ శివజ్యోతి..దయచేసి దిష్టి పెట్టకండి అంటూ!

Big Stories

×