Big Stories

Oil Apply to Hair in Summer: సమ్మర్ లో తలకు ఆయిల్ పెట్టుకుంటే.. ఏం జరుగుతుందో తెలుసా..?

Oil Apply to Hair in Summer: వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా చర్మం, జుట్టుపై కేర్ తీసుకోవడం ఎంతైన అవసరం. లేదంటే సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా సమ్మర్ లో జుట్టుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వేసవిలో చెమట పడుతుందని, చికాకుగా ఉంటుందిని జుట్టుకు చాలా మంది ఆయిల్ పెట్టరు. దీంతో జుట్టు దెబ్బతింటుంది. ఎండా కాలంలోనూ జుట్టుకు తప్పకుండా ఆయిల్ పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

సమ్మర్ లోనూ జుట్టుకు సరైన పోషణ ఇవ్వాలి. జుట్టు పొడిగా ఉన్నా, జిడ్డుగా ఉన్నా ఆయిల్ పెట్టాలి. వేసవిలో జుట్టుకు ఆయిల్ పెట్డడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ సీజన్ లో వేడి, సూర్యరశ్మి కారణంగా జుట్టులోని తేమ తగ్గిపోతుంది. దీంతో జుట్టు బలహీనంగా, నిర్జీవంగా మారి రాలిపోతుంది. ఆయిల్ పెట్టడం వల్ల తల కూల్ గా ఉంటుంది. అంతే కాకుండా జుట్టుకు పోషణ లభిస్తుంది.

- Advertisement -

Also Read: వేసవిలో డీహైడ్రేషన్ తగ్గించే.. ఫ్రూట్స్ ఇవే !

సమ్మర్ లో సూర్యుడి నుంచి వచ్చే యూవీ కిరణాల నుంచి ఆయిల్ జుట్టును రక్షిస్తుంది. డ్రై హెయిర్, వెంట్రుకల రంగు మారడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. చుండ్రు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. సాధారణంగా ఎండా కాలంలో తేలికపాటి ఆయిల్ లు వాడడం వల్ల జుట్టు షైనీగా మారుతుంది. మాయిశ్చరైజింగ్ ఎక్కువగా ఉండే ఆయిల్స్ వాడాలి. జిడ్డు జుట్టు ఉన్నవారు ద్రాక్ష విత్తన ఆయిల్, టీట్రీ ఆయిల్ లను వాడడం మంచిది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News