Central Increased SPG Security to Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల తర్వాత జరిగిన హింసపై కేంద్రం దృష్టి పెట్టింది. ఏకంగా పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులపై దాడి పాల్పడడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా కలెక్టర్లు, ఎస్పీలు, మిగతా అధికారులపై కేంద్రం ఎన్నికల సంఘం వేటు వేసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబుపై దాడులకు పాల్పడ్డారు అల్లరి మూకలు. పరిస్థితి గమనించిన కేంద్రం, ఆయనకు ఇచ్చే ఎస్పీజీ సెక్యూరిటీని అమాంతంగా పెంచింది.
ప్రస్తుతం చంద్రబాబుకు 12 మంది ఉన్నారు. దాన్ని ఇప్పుడు 24కు పెంచింది. 12 x 12 రెండు బ్యాచ్‌లుగా 24 మంది బ్లాక్ కమెండోలను కేటాయించింది. రెండురోజుల కేంద్రం నుంచి వచ్చిన భద్రతా అధికారుల టీమ్, చంద్రబాబు నివాసం, టీడీపీ కార్యాలయం, గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి కరకట్ట మీదుగా చంద్రబాబు ఇంటికి వెళ్లే ప్రాంతాలను పరిశీలించినట్లు వార్తలు వస్తున్నాయి.
అవన్నీ ప్రత్యర్థులు దాడి చేసేందుకు అనుకూలంగా ఉంటుందని భావించింది. ఈ క్రమంలో కేంద్రానికి భద్రతా సంస్థలు రిపోర్టు ఇవ్వడం జరిగిపోయింది. పోలింగ్ తర్వాత విపక్ష అభ్యర్థులపై వైసీపీ సానుభూతిపరులు దాడులకు పాల్పడ్డారు. ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం, భద్రతను పెంచింది.
గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఇంటిపైకి వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే తన మద్దతుదారులతో దూసుకువచ్చారు. ఆ సమయంలో చంద్రబాబును బయటకు రాకుండా గేట్‌కు తాళాలు వేశారు. ఆ తర్వాత చంద్రబాబు రోడ్ షో చేస్తుండగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో రాళ్లతో దాడి జరిగింది. ఆ ఘటనలో బాబు ఎస్పీజీ సిబ్బంది ఒకరు గాయపడ్డారు. ఈ పరిణామాలను బేరీజు వేసుకున్న కేంద్రం, ఉన్న భద్రతను అమాంతంగా పెంచేసింది.
ALSO READ: ఏపీ ప్రజలకు పవన్ కళ్యాణ్ లేఖ.. మీ ప్రేమ కదిలించిందంటూ..
గురువారం కేంద్రం ఎన్నికల అధికారులతో ఏపీ సీఎస్, డీజీపీతోపాటు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా హాజరయ్యారు. ఆయన కూడా చంద్రబాబు భద్రతపై రిపోర్టు ఇచ్చినట్టు వార్తలు లేకపోలేదు. ఎట్ ద సేమ్ టైమ్.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సెక్యూటీని తగ్గించి చంద్రబాబు రక్షణ పెంచడంపైనా ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో రకరకాల వార్తలు జోరుందుకున్నాయి.