BigTV English

Ruturaj Gaikwad on PKBS Match: టాస్ విషయంలో చాలా టెన్షన్ గా ఉంది: రుతురాజ్

Ruturaj Gaikwad on PKBS Match: టాస్ విషయంలో చాలా టెన్షన్ గా ఉంది: రుతురాజ్

Ruturaj Gaikwad Comments on CSK Loss against PBKS: ఐపీఎల్ లో అట్టడుగున ఉన్న పంజాబ్ సూపర్ కింగ్స్ ఒక్కసారి జూలు విదల్చడంతో అటు బౌలింగు, ఇటు బ్యాటింగ్ లో అంతా దఢదఢలాడిస్తున్నారు. ఈ క్రమంలో విజయాలతో దూసుకెళుతున్న చెన్నయ్ సూపర్ కింగ్స్‌కి, వారు చెక్ పెట్టారు. ఈ సందర్భంగా చెన్నై కెప్టెన్ రుతురాజ్ మాట్లాడుతూ.. మేం మరో 50-60 పరుగులు చేయాల్సిందని అభిప్రాయ పడ్డాడు. అయితే టాస్ గెలిచి ఉంటే బాగుండేదని అన్నాడు. ఈ మ్యాచ్ లో మాత్రం టాస్ కీలకమని అన్నాడు. జట్టుకన్నా ఎక్కువగా టాస్ దగ్గరే టెన్షన్ పడుతున్నట్టు తెలిపాడు.


మొదటి నుంచి పిచ్ బౌలింగ్ కి అనుకూలంగా ఉండటంతో చాలా ఇబ్బంది పడ్డామని అన్నాడు. వరుసగా వికెట్లు పడిపోవడంతో ఒక్కసారి డిఫెన్స్ మోడ్ లోకి వెళ్లినట్టు తెలిపాడు. పిచ్ పై విపరీతమైన తేమ ఉందని అన్నాడు. టాస్ ఓడిపోవడం కూడా మా ఓటమిని శాసించిందని అన్నాడు.

టాస్ గెలవడంపై చాలా కసరత్తులు చేశాం. కానీ అనుకున్న ఫలితం రాలేదని అన్నాడు. ఇదే సమయంలో మా జట్టు ఆటతీరుకన్నా టాస్ విషయంలోనే నేను ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నానని మరోసారి అన్నాడు. విపరీతమైన తేమ ఉన్న మైదానంలో లక్ష్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు. గత మ్యాచ్‌లో భారీ తేడాతో విజయం సాధించామని అన్నాడు. టాస్, పిచ్ కండిషన్స్ మన ఆధినంలో లేనివని, వాటికి మనమేం చేయలేమని వేదాంతిలా చెప్పాడు.


Also Read: జూలు విదిల్చిన పంజాబ్ కింగ్స్.. ధోనీ సేన ఓటమి

ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మేం ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సిందని అన్నాడు. ఈ పిచ్ మీద 180 పరుగులు కూడా చేయలేకపోయామని ఆవేదన వ్యక్తంచేశాడు. పతిరణ, దేశ్‌పాండే లేకపోవడంతో జట్టు బ్యాలెన్స్ తప్పిందని అన్నాడు. వచ్చే మ్యాచ్ ల్లో పుంజుకుని ముందడుగు వేస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×