Big Stories

 Heavy Rains in Dubai: మరోసారి దుబాయిని ముంచేసిన వానలు.. విమాన సర్వీసులకు మళ్లీ ఆటంకం!

Dubai Rains: దుబాయ్‌లో వానలు దంచికొడుతున్నాయి. మరోసారి ఎడారి దేశాన్ని వరదలు ముంచెత్తాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏప్రిల్‌లో తీవ్రమైన వరదలను చూసిన కొన్ని రోజుల తర్వాత, గురువారం తెల్లవారుజామున అబుదాబి.. దుబాయ్‌లో ఉరుములతో కూడిన భారీ వర్షం పలు ప్రాంతాల్లో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ముఖ్యంగా దుబాయ్‌లో ప్రజారవాణా స్తంభించింది. దుబాయ్‌లో విమానాలు, బస్సు సర్వీసులను అధికారులు రద్దు చేశారు.

- Advertisement -

ఖలీజ్ టైమ్స్ ప్రకారం, దుబాయ్‌కి వచ్చే ఐదు ఇన్‌బౌండ్ విమానాలను రాత్రిపూట దారి మళ్లించారు. అయితే తొమ్మిది అరైవల్‌లు.. నాలుగు అవుట్‌బౌండ్ విమానాలను రద్దు చేశారు. ఎమిరేట్స్‌కు చెందిన పలు విమానాలు కూడా రద్దు చేసినట్లు నివేదిక పేర్కొంది.

- Advertisement -

Also Read: ‘దుబాయ్ పర్యటనలను రీషెడ్యూల్ చేసుకోండి’.. భారత ఎంబసీ కీలక సూచనలు!

అబుదాబిలోని కొన్ని ప్రాంతాల్లో వీధుల్లో నీరు నిలిచిందని, జెబెల్ అలీ, అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం, దుబాయ్ ఇండస్ట్రియల్ సిటీ, దుబాయ్ ఇన్వెస్ట్‌మెంట్స్ పార్క్, జుమేరా విలేజ్ ట్రయాంగిల్‌లో బలమైన గాలులు వీచినట్లు స్థానిక మీడియా నివేదించింది.

బుధవారం, దుబాయ్ విమానాశ్రయాలు, రెండు స్థానిక విమానయాన సంస్థలు ప్రయాణీకులకు సలహాలు జారీ చేశాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లేటప్పుడు ఆలస్యమైయ్యే అవకాశాలున్నాయని ప్రయాణికులకు అధికారులు అలెర్ట్ జారీ చేశారు.

Also Read: Kim Jong Un Picks 25 Virgins: లోగుట్టు బయటకు.. కిమ్ మామూలోడు కాదు.. నిత్యం అదే పని..!

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎడారి నగరమైన దుబాయ్‌ను తాకిన రికార్డు తుఫాను ఫలితంగా కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు నివేదకిలు పేర్కొన్నాయి. సాధారణ జీవితం అతలాకుతలం అయ్యిందని.. రవాణా వ్వవస్థ స్తంభించిందని.. దీంతో విమాన సర్వీసులు రద్దు అయ్యాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News