Big Stories

Reduce Spice in Food: కూరలో మసాలా ఎక్కువైందా..? ఈ చిట్కా ట్రై చేయండి!

Reduce the Spice in Food with Potato, Curd and Milk: సాధారణంగా రోజు ఇంట్లో వండే కూరల్లో ఉప్పు లేదా మసాలా, కారం ఇలా ఏదో ఒకటి ఎక్కువ అవుతూ ఉంటుంది. అది సాధారణమే కదా అని అడ్జస్ట్ అయి తినే వారు చాలా మంది ఉన్నా.. కొన్ని సార్లు ఇలాంటివి పెద్ద చిక్కులు తెచ్చి పెడుతుంటాయి. ఇంట్లో బంధువులు లేదా ఫ్రెండ్స్ వచ్చిన సమయంలో చేసిన వంటల్లో కాస్త మసాలా ఎక్కువైతే చాలా అమ్మో ఇక రెండు బుక్కలు తిని ప్లేటు పక్కన పెట్టేస్తారు. అందువల్ల ఇంట్లో వంట చేసే మహిళలకు ఇది ఒక తలనొప్పి అనే చెప్పాలి. అయితే కూరల్లో మసాలా ఎక్కువైతే బాధపడకుండా కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఆ మసాలా ఘాటును తగ్గించుకోవచ్చు. మరి అవేంటో చూద్దాం.

- Advertisement -

కొబ్బరి పాలు..

- Advertisement -

కూరల్లో మసాలా ఎక్కువైతే వెంటనే కొబ్బరిపాలు పోసి కాసేపు ఉడకనిస్తే చాలు అందులోని మసాలా ఘాటు అంతా మాయమైపోతుంది.

పాల పదార్థాలు..

పెరుగు, వెన్న వంటి వాటిని కూడా మసాలా ఘాటు ఎక్కువైన ఆహారంలో వాడడం వల్ల అందులోని ఘాటును తగ్గించొచ్చు.

Also Read: ఒక్క యోగాసనంతో అదిరిపోయే అందం మీ సొంతం..

చక్కెర, తేనె

చక్కెర లేదా తేనె వంటి పదార్థాలను కూడా కూరల్లో వాడడం వల్ల అందులోని ఘాటును తగ్గించి, కాస్త తీపి దనం వచ్చేలా చేయొచ్చు.

నిమ్మరసం

నిమ్మరసం అయితే అన్ని వంటకాలను సరి చేసేందుకు చక్కగా పనిచేస్తుంది. నిమ్మరసం లేదా వెనిగర్ ను మసాలా ఎక్కువైన వాటిలో వేయడం వల్ల మసాలా ఘాటును తగ్గించుకోవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News