Temperatures in Telangana: తెలంగాణలో సూరీడు సుక్కలు చూపిస్తున్నాడు. ఉదయం 9 దాటితే చాలు వేడి గాలులతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. మండుతున్న ఎండల కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. మునుపెన్నడు లేని విధంగా ఈ ఏడాది ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏకంగా గరిష్ట ఉష్ణోగ్రతల రికార్డులను బద్దలుకొడుతున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుంది. వచ్చే రెండు రోజుల పాటు రాష్ట్రంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తరుణంలో ప్రజలకు వాతావరణ శాఖ కీలక విజ్ఞప్తి చేసింది. అవసరం ఉంటే తప్ప బయటకు అస్సలు రాకూడదని సూచించింది.
Also Read: TSRTC Good News : ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. వాటిపై ఛార్జీలుండవ్..
సూర్యపేట జిల్లాలోని మునగాలలో 46.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు నల్గొండ జిల్లా కామారెడ్డిగూడెంలో 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జయశంకర్ భూపాలపల్లిలోను ఎండలు మండిపోతున్నాయి. సింగరేణి ఏరియా అయినందున బొగ్గుగనులు, థర్మల్ కేంద్రాల కారణంగా వడగాలులు, వేడి తీవ్రత ఎక్కువగా నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది.