BigTV English

Amitabh Bachchan: కల్కి కోసం అమితాబ్ ఎన్ని కోట్లు తీసుకున్నాడంటే.. ?

Amitabh Bachchan: కల్కి కోసం అమితాబ్ ఎన్ని కోట్లు తీసుకున్నాడంటే.. ?

Amitabh Bachchan: బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు టాలీవుడ్ అంటే ఎంతో ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో ఉన్న సెలబ్రిటీలతో అమితాబ్ ఎప్పుడు సత్సంబంధాలను కొనసాగిస్తుంటాడు. కొన్నిసార్లు ఆ స్నేహం కోసం గెస్ట్ రోల్స్ లో ఫ్రీగా కనిపిస్తూ ఉంటాడు. ఈ మధ్యకాలంలో అమితాబ్ స్టార్ హీరోల సినిమాల్లో అతిధి పాత్రల్లో మెరుస్తూ మెప్పిస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న తెలుగుచిత్రం కల్కి2889AD సినిమాలో నటిస్తున్నాడు.


నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా.. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది. కమల్ హాసన్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను వేరే లోకంలోకి తీసుకెళ్లాయి. ఇక నిన్నటికి నిన్న అమితాబ్ క్యారెక్టర్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇందులో అశ్వద్దామగా అమితాబ్ నటించాడు. ఇక ఈ గ్లింప్స్ చూసాక సినిమాపై మరింత హైప్స్ క్రియేట్ అయ్యాయి. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఈ క్యారెక్టర్ కోసం బిగ్ బి బాగానే ఛార్జ్ చేసినట్లు సమాచారం.

కేవలం 45 రోజుల కోసం అమితాబ్.. రూ. 18 కోట్లు అందుకున్నాడట. ఈ సినిమాలో అమితాబ్ ను యంగ్ లుక్ లో కూడా చూపించనున్నారు. అదంతా గ్రాఫిక్స్ లోనే క్రియేట్ చేయనున్నారని ఈ గ్లింప్స్ లో పోస్టర్ చూస్తే అర్ధమవుతుంది. మొత్తం సినిమాలో దాదాపు అరగంట కన్నా తక్కువే అమితాబ్ సీన్స్ ఉంటాయంట. మరి ఇందులో ఎంత నిజం అనేది తెలియదు కానీ, అమితాబ్ అయితే బాగా ఛార్జ్ చేశాడని అంటున్నారు. మరి ఈ సినిమాతో ఆయనకు ఎలాంటి పేరు వస్తుందో చూడాలి.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×