Big Stories

Pulasa Fish : చేపలందు పులస చేప రుచే వేరయా..!

Pulasa Fish : మాంసాహార ప్రియలు అమితంగా ఇష్టపడే వాటిలో చేపలు కూడా ఉంటాయి. అందులోనూ పులస చేపలు అంటే ఎంతో ప్రాధ్యాన్యత ఇస్తారు. ‘పుస్తెలు అమ్మి ఐనా సరే పులస తినాలి’ అనేది నానుడి. దీని రుచి అంత గొప్పగా ఉంటుంది మరి. పులస చేప వర్షాకాలంలో మాత్రమే.. అది కూడా గోదావరిలో మాత్రమే దొరుకుతుంది. ఈ చేపలో ఉండే ప్రొటీన్లు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందుకే వాటిని తినాలని చాలా మంది ఆరాటపడుతుంటారు.

- Advertisement -

ఒక ఏడాదికి కనీసం కిలో చేపముళ్లు మన కడుపులో పడితే మంచి ఆరోగ్య ఫలాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇక చేపల్లో పులస గురించి చెప్పక్కర్లేదు. ఈ చేపల రుచి వేరుగా ఉంటుంది. ఇవి ఉభయ గోదావరి జిల్లాల్లో దొరుకుతాయి.

- Advertisement -

పులస చేపల ధర చూస్తే ఆశ్యర్యపోక తప్పదు. డిమాండ్‌ను బట్టి కిలో రూ.15 వేలు వరకు ఉండొచ్చు. గోదావరిలో జాలర్ల వలకు పులస చిక్కితే.. వారి పంట పండినట్లే. కిలో నుంచి ఉండే ఈ చేపల్ని మార్కెట్లో వేలానికి పెడితే.. రేటు ఎంతైనా సరే కొనుక్కుంటారు. ఇవి ప్రత్యేకించి జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మాత్రమే దొరుకుతాయి. అందుకనే ఈ చేపలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది.

ఈ చేపలు గోదావరి నదిలో మాత్రమే దొరుకుతాయి. ఇదే చేప సముద్రంలో దొరికితే ఇలస అంటారు. గోదావరిలో దొరికితే పులస అంటారు. ఈ చేపల సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజినియా వంటి దూరం ప్రాంతాల నుంచి ఖండాలను దాటి హిందూ మహాసముద్రం గుండా ప్రయాణించి బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయి.

గోదావరి నదికి వరద వచ్చి అది అంతర్వేది దగ్గర సముద్రంలో కలిసే సమయంలో గుడ్లు పెట్టడం కోసం గోదావరిలోకి ఎదురీదుకుంటూ ప్రవేశిస్తాయి. నదీ ప్రవాహానికి అతివేగంగా ఎదురీదడం ఈ చేప ప్రత్యేకత. గోదావరి తీపి నీటిలో కలిసే సరికి ఈ చేప రంగు, రుచి మారి పులసగా మారుతుంది. పులస చేపలు గోదావరి మొత్తం దొరకవు. కేవలం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి నీరు సముద్రంలో కలిసే మధ్యలో మాత్రమే దొరుకుతాయి. గుడ్లు పెట్టిన తర్వాత మళ్లీ ఇవి అక్టోబర్‌లో సముద్రంలోకి చేరుకుంటాయి.

గోదావరి తీపి నీరు-సముద్రంలోని ఉప్పునీరు కలవడం వల్ల ఈ చేపలకు ప్రత్యేకమైన రుచి వస్తుంది. ఈ చేపలు గోదావరికి ఎదురీది ధవళేశ్వరం చేరే క్రమంలో నీటిలోని మార్పు వల్ల పులసగా మారతుంది. ఏటికి ఎదురీది బతికే చేపల్లో ఇవి ప్రత్యేకమైనవి. వీటి శరీరంలో ముళ్లు ఎక్కువగా ఉండటం వల్ల నీటి ప్రవాహానికి ఎదురుగా వెళ్లినా చనిపోకుండా ఉంటాయి. గోదావరి నదిలో కలిసే సమయంలో జాలర్లు వీటిని పట్టుకుంటారు.

పులస చేపలు బంగారు రంగులో ఉంటాయి. వాటి కనుల దగ్గర పసుపు రంగులో ఉంటుంది. వీటిని కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మోసోపోయే ఛాన్స్ ఉంది. తెలిసిన వారి ద్వారా తీసుకుంటే మంచిది. ప్రతి సీజన్లో యానాంలో పులస చేపల వ్యాపారం లక్షల రూపాయల్లో జరుగుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News