Big Stories

Nagari Politics: రోజాకు రింగా రింగా.. షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేతలు..

- Advertisement -

రాష్టంలో టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గాలలో చిత్తూరు జిల్లాలోని నగరి ఒకటి. అక్కడ నుంచి వరుసగా రెండో సారి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఆర్‌కే రోజా సెల్వమణి నోరు తెరిస్తే టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌లపై విరుచుకుపడుతుంటారు. అలాంటామెను ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో అడుగుపెట్టనీయకూడదన్న పట్టుదలతో ఉన్నారు టీడీపీ పెద్దలు ఇలాంటి పరిస్థితుల్లో నగరి వైసీపీ నేతలు రోజాకు పెద్ద షాక్ ఇచ్చారు. 12 సంవత్సరాల క్రితం వైసీపీ స్థాపించినప్పుడు. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీలో చేరి నగరిలో పిల్లర్స్‌గా మారిన నాయకులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

- Advertisement -

Also Read: వెంకటగిరిలో గెలుపెవరిది?

నగరి నియోజకవర్గంలో పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి. రాష్టవ్యాప్తంగా ప్రభావం చూసే అంశాలు, సెంటిమెంట్స్ ఇక్కడ పనిచేయవు. తమిళ మెుదలియార్లతో పాటు చేనేతలు , రైతులు ఎక్కువుగా ఉండే ప్రాంతం. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో నగరి నుంచి టీడీపీ అభ్యర్థి గాలి ముద్దు క్రిష్ణమ నాయుడు విజయం సాదించారు. వైసీపీ అవిర్భవం తర్వాత గాలిని రోజా ఓడించారు. అప్పట్లో మెజార్టీ కేవలం 800 ఓట్లు.. గాలి ముద్దుకృష్ణమనాయుడు నిర్లక్ష్యంతోనే ఓటమి పాలయ్యారని అంటారు. తర్వాత 2019లో కూడా గాలి భానుప్రకాష్‌పై రోజా విజయం సాధించారు. అప్పుడు కూడా రోజాకి దక్కింది 2,708 ఓట్ల మెజార్టీనే అంటే నగరిలో ఏ పార్టీకైనా క్షేత్ర స్థాయి నాయకులు ఇక్కడ ఎంత కీలకమో అర్థమవుతుంది.

నగరిలో పార్టీ అవిర్భావం నుంచి నిండ్ర మండలానికి చెందిన శ్రీశైలం ఆలయ పాలక మండలి చైర్మన్ రెడ్డివారి చెంగారెడ్డి, క్షత్రియ సామాజికవర్గంలో మంచి పట్టున్న వైసీపీ రాష్ట రైతు విభాగం ప్రధాన కార్యదర్శి లక్ష్మిపతిరాజు, పుత్తూరుకు చెందిన మొదలియర్ సామాజిక వర్గానికి చెందిన మాజీ సర్పంచ్ అమ్ములు, వడమాలపేట జడ్పీటిసి మురళీధర్‌రెడ్డి కీలకంగా వ్యవహారించారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజా తమను నిర్లక్ష్యం చేసి తమ మండలాలలో తనకుటుంబ సభ్యులను షాడో ఎమ్మెల్యేలుగా పెట్టి దోచుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. రోజా ఈ సారి గెలిచే పరిస్థితి లేదని తాము మొత్తుకున్నా అధిష్టానం పట్టించుకోలేదని అందుకే తమ నిర్ణయం తాము తీసుకున్నామంటున్నారు.

Also Read: అడుగులు మోడీ వైపేనా?

ఇటీవలే ఆ అసంతృప్తి నేతల్లో అమ్ములు పార్టీకి రాజీనామా చేసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. మరోవైపు మురళీధర్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ పార్టీ గ్రూపులలో వాట్సాప్ సందేశం వచ్చిందంట. దాంతో తామంతా రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించారు సదరు నేతలు రోజా, అమె కుటుంబం అన్ని విషయాలలో కమీషన్లు దండుకున్నారని మురళీరెడ్డి బహిరంగంగానే అరోపిస్తున్నారు. ముఖ్యంగా ఎపిఐఐసి భూములను టిటిడికి అప్పగించడానికి రోజా 12 కోట్లు తీసుకున్నారన్న ఆరోపణ ఉంది. మరో వైపు అంగనవాడి వర్కర్ల పోస్టులు, సబ్ స్టేషన్ పోస్టులు సైతం అమ్ముకున్నారని కుటుంబం మొత్తం కలిసినగరిని దోపిడీ చేసిందని అంటున్నారు.

పార్టీ పట్ల విధేయతతో తాము కష్టపడి రోజాని గెలిపించామని అయితే గెలిచిన తర్వాత అది సొంత ప్రతిభలాగా రోజా భావిస్తున్నారని ఆమె తీరుపై అధిష్టానం దృష్టికి తీసుకుపోయినా ఫలితం లభించలేదని అంటున్నారు. ఆ క్రమంలో రోజా వైఖరితో విసిగిపోయి వైసీపీకి రాజీనామా చేశామని త్వరలో టీడీపీలో చేరతామని మీడియాముఖంగా ప్రకటించారు.

Also Read: BJP Constitution Change Comments: రాజ్యాంగం మార్చేస్తారా..? అసలు సెక్యూలర్ అనే పదం అర్థం ఏంటి..? ఫుల్ స్టోరీ!

మొత్తం మీదా గత అయిదేళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఎన్నికల పోలింగ్‌కు ముందు బయటపడింది. ఇది తెలిసే రోజా స్వయంగా వెళ్లి చక్రపాణిరెడ్డితో మాట్లాడటానికి ప్రయత్నించినా ఆయన అంగీకరించలేదంట. ఉగాది రోజు అయనను కలవడానికి రోజా వెళ్ళగా అయన కలవడానికి ఇష్టపడలేదంట. ఆ క్రమంలోఅసమ్మతి నేతలంతా ఇంకా ఎందుకు పార్టీలో కొనసాగాలి. ఇంకా ఎన్నాళ్లు పల్లకీ మోయాలని భావించి .. అందరూ కలిసి రాజీనామా నిర్ణయం తీసుకున్నారంట.

మొత్తం మీదా నగరిలో టీడీపీకి ఈ పరిణామం మరింత బూస్టప్ ఇచ్చిందంటున్నారు. రోజా యాంటీ టీమ్ చేరిక తమకు మరింతగా కలసి వస్తుందని కార్యకర్తలు ఖుషీ అవుతున్నారు. పుత్తూరు, నిండ్ర, వడమాలపేట, విజయపురం మండలాలలో పట్టున్న సదరు రాకతో టీడీపీ బలం పుంజుకుంటుదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే రోజా మాత్రం తన అభిమానులు, వాలంటీర్ల వ్యవస్థ తనకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారంట. మరి చూడాలి రోజా సెల్వమణి హ్యాట్రిక్ ఆశలు ఎంతవరకు నెరవేరతాయో?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News