Big Stories

Anakapalli Family Politics: సొంత బంధువులే శత్రువులు.. డిప్యూటీల ఫ్రస్టేషన్

Anakapalli Family Politics Budi Mutyala Naidu vs Budi Ravi: డిప్యూటీ సీఎంల ఫ్యామిలీల్లో కూడా పెద్ద పొలిటికల్ సర్కస్సే నడుస్తుంది. అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మరో డిప్యూటీ అయిన జీడి నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామిలకు ఇంటి పోరు పెద్ద తలనొప్పిగా మారింది. బూడిని సొంత కొడుకు, బామ్మరుదులు టార్గెట్ చేస్తున్నారు. ఆయన కొడుకు స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తూ సవాల్ విసురుతున్నారు. మరోవైపు నారాయణస్వామికి మేనల్లుడు ఏకు మేకయ్యాడు. ఇక్కడ ట్టిస్ట్ ఏంటంటే .. ఇద్దరు డిప్యూటీ సీఎంల కుమార్తెలు ఎమ్మెల్యే కేండెట్లుగా బరిలో ఉన్నారు. ఇప్పుడు సొంత బంధువులే వారితో సర్కస్ చేయిస్తున్నారు.

- Advertisement -

అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు.. ఆ సెగ్మెంట్ పరిధిలోని మాడుగుల ఎమ్మెల్యేగా వరసగా రెండోసారి గెలుపొందిన వ్యక్తి మంత్రి బూడి ముత్యాల నాయుడు .. ముచ్చటగా మూడోసారి మాడుగుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచి రెండోసారి మంత్రిగా పనిచేయాలన్నదే మూడు ముత్యాల నాయుడు కల ఈ ఎన్నికల్లో అనకాపల్లి నుండి కూటమి అభ్యర్థిగా బిజెపి నాయకుడు సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. సీఎం రమేష్‌ను ఎదుర్కోవడానికి వైసీపీకి మాడుగుల ఎమ్మెల్యే తప్ప ప్రత్యామ్నాయం లేకుండా పోయింది.

- Advertisement -

Also Read: అక్కాచెల్లెళ్ల అటాక్‌.. ఆస్తి వివాదాలే కారణమా?

ముత్యాలనాయుడిని మూడోసారి మాడుగుల ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన వైసీపీ.. విపక్షం బలమైన సీఎం రమేష్‌ని బరిలోకి దింపడంతో .. మార్పులు చేర్పులు చేసి నాయుడినిఅనకాపల్లి ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించింది. మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థినిగా బూడి ముత్యాలనాయుడు కూతురు అనురాధను ఖరారు చేసింది. ఎప్పుడైతే జగన్ ఆ ఫ్యామిలీ ప్యాకేజ్ ప్రకటించారో.. ముత్యాలనాయుడు కొడుకు బూడి రవి రెబల్ అవతారమెత్తారు. మాడుగుల నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచి తన చెల్లిని, ఎంపీగా తండ్రిని ఓడిస్తానని శపధం చేసి ఆ ఇద్దరికీ షాక్ ఇచ్చారు.

బూడి ముత్యాలనాయుడుకి ఇద్దరు భార్యలు మొదటి భార్య కొడుకే ఈ రవి. మొదటి భార్య చనిపోయిన తర్వాత ఆమె చెల్లెలునే బూడి ముత్యాల నాయుడు రెండో వివాహం చేసుకున్నారు. రెండో భార్య కూతురు అనురాధ.. తల్లులు వేరైనా అందరూ కలిసే ఉంటారు. అయితే రాజకీయాల్లో మాత్రం రవిని కాదని మొదటి నుండి కూతురు అనురాధను ప్రోత్సహిస్తూ వస్తున్నారు ముత్యాలనాయుడు దాంతో బూడి రవి చెల్లెలిపై పోటీకి సిద్ధమయయ్యారు. దాంతోపాటు అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన తండ్రి బూడి ముత్యాల నాయుడుకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.

ఒకవైపు కొడుకు వ్యతిరేక ప్రచారంతోనే తలబొప్పికడుతున్న ముత్యాలనాయుడికి మరోవైపు సొంత బామ్మర్ది చప్ప గంగాధర్‌ బీజేపీకి మద్దతుగా తిరుగుతుండటం అస్సలు మింగుడుపడటం లేదంట. ఇది మనసులో పెట్టుకున్న ముత్యాలనాయుడు తాజాగా సీఎం రమేష్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై దాడి సమయంలో బావమరిది గంగాధర్‌పైనే ముందుగా దాడి చేశారు. బూడి స్వగ్రామం తారువలో కూటమి కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడికి పాల్పడి గంగాధర్‌ని టార్గెట్ చేశారు. వారిని పరామర్శించడానికి వెళ్లిన సీఎం రమేశ్‌పై దౌర్జన్యం చేసి చొక్కా చించేశారు. ఆయన్ను అక్కడి నుంచి తీసుకెళుతున్న పోలీసు వాహనంపై రాళ్లు విసిరి రెండు గంటలపాటు బీభత్సం సృష్టించారు. అంత రాద్దాంతం జరిగి.. రెండు వర్గాలు పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కడానికి కారణం బూడిలో మొదలైన ఫ్యామిలీ ఫ్రస్ట్రేషనే అంటున్నారు.

Also Read: రోజాకు రింగా రింగా.. షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేతలు..

ఫ్యామిలీ మెంబర్లు ఇస్తున్న ట్విస్టులతో సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తున్న మరో డిప్యూటీ సిఎం నారాయణస్వామి చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు నారాయణ స్వామి ప్రస్తుతం దళిత కోటాలో డిప్యూటీ సిఎంగా కొనసాగుతున్నారు. ఆయన మంత్రి అయ్యాక స్థానికంగా సొంత పార్టీలోనే వ్యతిరేకత పెరిగిపోయింది. దాంతో ఆయన్ని చిత్తూరు ఎంపీ అభ్యర్ధిగా పంపాలని చూశారు జగన్ .. అయితే దానికి స్వామి అంగీకరించలేదు. చివరికి ఆయన కూతురు కృపాలక్ష్మికి జీడినెల్లూరు టికెట్ కట్టపెట్టారు వైసీపీ అధ్యక్షుడు.

సెగ్మెంట్లో ఇప్పటికే మాజీ ఎంపీ జ్ణానేంద్రరెడ్డి వర్గం నారాయణస్వామిని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దానికితోడు నియోజకవర్గంలోని పెనుమూరు, జిడినెల్లూరు, పాలసముద్రం, కార్వేటినగరం, వెదురుకుప్పం మండలాలలో అయనకు వ్యతిరేకవర్గాలు తయారయ్యాయి. దాంతోనే తల పట్టుకుంటున్న స్వామితో మేనల్లుడు సర్కస్ చేయిస్తున్నారిప్పుడు.. ఇంత కాలం నారాయణస్వామికి చేదోడుగా ఉన్న ఆయన మేనల్లుడు రమేష్‌బాబు కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీలో నిలిచారు. మేనల్లుడే తన వారసుడని గతంలో ప్రకటించిన నారాయణస్వామి మాట తప్పారని ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇప్పుడు రమేష్‌కి మాజీ ఎంపీ వర్గం కూడా మద్దతిస్తుండటంతో.. తన కూతురి భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్నారంట డిప్యూటీ.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News