BigTV English

Ram Pothineni: హిట్ కోసం ఆ పని కూడా చేస్తున్న రామ్.. ?

Ram Pothineni: హిట్ కోసం ఆ పని కూడా చేస్తున్న రామ్.. ?

Ram Pothineni: ఒకప్పుడు సినిమా అంటే థియేటర్.. పువ్వులు.. కటౌట్స్.. పాలాభిషేకాలు.. పూలాభిషేకాలు.. సినిమా హిట్ అయ్యిందా.. ? ఫట్ అయ్యిందా తెలియడానికి మినిమమ్ 10 రోజులు పట్టేది. ఇప్పుడు ఇదంతా మారిపోయింది. ఓటిటీ దీన్నంతా మార్చేసింది. ఎండల్లో సినిమాకు కుటుంబాన్ని ఏసుకొని ఏం పోతాంలే.. ఓటిటీలో వస్తుందిగా అప్పుడు చూద్దాం. అమ్మ బాబాయ్ టికెట్స్ రేట్లు ఏంటి అంత ఉన్నాయి.. అదే టికెట్ రేటు ఓటిటీకి కట్టమంటే నెల మొత్తం చూడొచ్చు.  ఆ ఇంట్లోనే చూసుకుందాంలే. ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఇలానే ఆలోచిస్తున్నారు. ఇ


క ప్రేక్షకుల అభిరుచిని బట్టి ఇండస్ట్రీనే మారిపోయింది. థియేటర్ లో సినిమాలు లాభం లేదు అనుకున్నవారు.. డైరెక్ట్ ఓటిటీలోనే సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఓటిటీ ప్లాట్ ఫార్మ్ మేకర్స్ సైతం స్టార్ హీరోలను డిజిటల్ ఎంట్రీకి రెడీ చేస్తున్నారు. చిన్నా.. పెద్ద హీరోలు అని ఏం లేదు. కథ నచ్చితే డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. సీనియర్ హీరో వెంకటేష్ నే ఈ ఫార్ములా అర్ధం చేసుకొని రానా నాయుడు చేశాడు.

కుర్ర హీరోలు సైతం ఒక్కొక్కరిగా ఓటిటీ ఎంట్రీ ఇవ్వడం మొదలుపెట్టారు. తాజాగా ఈ లిస్ట్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కూడా చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రామ్ కు ఒక పెద్ద హిట్ కావాలి. దానికోసం బాగా కష్టపడుతున్నాడు. పూరి జగన్నాథ్ తో రామ్ డబుల్ ఇస్మార్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాపై ఆశలు ఉన్నా.. అది సినిమా తరువాత ఉంటుందా లేదా అనేది తెలియదు. ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్తగా రామ్ డిజిటల్ ఎంట్రీ ఇచ్చే ప్లాన్ లో ఉన్నాడని టాక్ నడుస్తోంది. ఈ మధ్యనే నెట్ ఫ్లిక్స్.. రామ్ తో చర్చలు కూడా జరిపిందట.


కథ నచ్చితే ఓటిటీ అయినా చేస్తాను అని రామ్ చెప్పినట్లు టాక్. నిజం చెప్పాలంటే రామ్ ఆలోచించే విధానంలో ఎటువంటి తప్పు లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో థియేటర్ లో పాన్ ఇండియా అంటూ తిరగడం కన్నా ఓటిటీ లో ఒక్క హిట్ సిరీస్ తీసినా అంతకుమించిన పేరు వస్తుంది. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×