Big Stories

Harirama Jogaiah Comments: పవన్ పదవిపై జోగయ్య జోస్యం..

Harirama Jogaiah Comments on Pawan Kalyan: ఆయన ఆషామాషీ కళాకారుడు కాదు.. ఎయిటీ ఫైవ్ (85) ప్లస్ సుదీర్ఘ జీవితంలో ఎన్నోరంగాల్లో రాణించారు .. సినీ, పొలిటికల్ ఇండస్ట్రీల్లో తనదైన మార్క్ చూపించుకోగలిగారు. సినీ ప్రొడ్యూసర్, జడ్పీ చైర్మన్, రాష్ట్ర మంత్రి.. ఎంపీ. ఇలా చాలా రోల్స్ పోషించిన ఆ పెద్దాయన  వయోభారం అడ్డంపడుతున్నా పొలిటికల్ హడావుడి మాత్రం మానడం లేదు. ఆ క్రమంలో మరో కొత్త పాత్ర పోషించడం మొదలుపెట్టారు.. తనని తానే అనలస్టుగా ప్రకటించుకుని  పొలిటికల్ జోస్యాలు చెప్పాడం మొదలుపెట్టారు. ఇంతకీ ఆ ఏజ్డ్ పొలిటీషియన్ ఎవరంటారా?

- Advertisement -

చేగొండి వెంకట హరిరామజోగయ్య  అప్పట్లో సినీ ఇండస్ట్రీలో చేగోండి హరిబాబుగా పాపులర్ అయిన ఆయన .. బాబు పిక్చర్స్ బ్యానెర్‌పై సినిమాలు తీసి గోదావరి జిల్లాల్లో సుపరిచితులయ్యారు. సూపర్‌ హిట్ సినిమా దేవుళ్లు ప్రొడ్యూసర్ ఈ బాబుగారే  ఒక వైపు సినిమాలు తీస్తూనే పాలిటిక్స్‌లో ఎంటర్ అయిన జోగయ్య 1971లో వెస్ట్ గోదావరి జడ్పీ చైర్మన్‌గా పనిచేశారు. నర్సాపురం ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచి టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కేబినెట్ బెర్త్‌లు దక్కించుకున్నారు. తర్వాత 2004లో కాంగ్రెస్ నుంచి నరసాపురం ఎంపీగా లోక్‌సభకు కూడా వెళ్లొచ్చారు. అప్పటికే ఏడుపదులు వయస్సు పైబడటంతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ఆ క్రమంలో కాపు నేతగా హడావుడి మొదలుపెట్టారు.

- Advertisement -

కాపుల అభ్యున్నతి కోసం , ఎన్నో ఎళ్ల కాపుల తీరని కలగా ఉన్న కాపు రిజర్వేషన్స్ కోసం కాపు బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం అంటూ . 2020 ఆగష్టు 9 వ తేదీన చాలా అట్టహాసంగా… కాపు సంక్షేమ సేనను.. ప్రారంభించారు. అప్పటికే కాపు ఉద్యమ నేతగా ఉన్న ముద్రగడ పద్మనాభం టీడీపీ ప్రభుత్వ హయంలో కాపు సంక్షేమ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి. 2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చాక కామ్ అయిపోయారు. టీడీపీ హయాంలో కాపులకు కల్పించిన రిజర్వేషన్లను జగన్ సర్కారు రద్దు చేసినా ముద్రగడ నోరెత్తలేదు.

Also Read: మారిన జగన్ స్వరం.. రీజనేంటి?

దాంతో ముద్రగడ వైసీపీని అధికారం లోకి తేవడానికి కులం పేరుతో కోవర్ట్ గేమ్ ఆడారని ఇటు కాపు నాయకులూ, జన సైనికులు సోషల్ మీడియాలో హోరెత్తించారు. ఒక దశ లో ముద్రగడ పద్మనాభానికి ఫోన్ చేసి మరి దూషించారు. సీఎం జగన్ రెడ్డి అంటే భయమని , జగన్ కు భయపడే ఉద్యమానికి తెర దించారనిపెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ముద్రగడ ఇక తాను కాపు సామాజికవర్గ ఉద్యమాలకు దూరంగా ఉంటానని ఆసక్తి ఉన్న వాళ్ళు ముందుకు తీసుకు వెళ్ళండి అంటూ బహిరంగ లేఖ విడుదల చేసారు.

సరిగ్గా అప్పుడే సీనియర్ పొలిటీషియన్ హరి రామ జోగయ్య రంగ ప్రవేశం చేసారు. సీఎం జగన్ పాలనను ఎండగడుతూ కాపు అభ్యున్నతి కోసం కాపు సంక్షేమ సేన ప్రారంభిస్తున్నానని ప్రకటించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను సీఎం చేయడం లక్ష్యంగా పని చేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం హరిరామజోగయ్య సీనియార్టీని గౌరవిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా వెళ్ళినప్పుడుల్లా జోగయ్య ఇంటికి వెళ్లో లేక ఫోన్ లోనో యోగ క్షేమాలు కనుక్కునేవారు.

ఇక అప్పటినుంచి జనసేనకు అప్రకటిత సలహాదారు అవతారమెత్తారు ఆ పెద్దాయన సలహాలు, సూచనలంటూ పవన్‌కు బహిరంగలేఖలు రాయడం మొదలుపెట్టారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొదట్లో జోగయ్య లేఖలకు సానుకూలంగా స్పందించినా రానురాను జోగయ్య లేఖలు శృతి మించడం తో పవన్ సైతం లైట్ తీసుకున్నారు. ఇక టీడీపీ జనసేన పొత్తు అనంతరం రాజకీయ పరిణామాలను పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ స్ట్రాటజీలకు భిన్నంగా బహిరంగ లేఖల దండయాత్ర చేశారు జోగయ్య .

జోగయ్య మీద అభిమానం తో అయన కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ ను సైతం జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా నియమించారు జనసేనాని. అయితే జోగయ్య మాత్రం అదేమీ పట్టనట్లు ఎవరెవరికి సీట్లు ఇవ్వాలో చెప్పడం. తన కుమారుడు చేగొండి సూర్య ప్రకాష్‌కు నిడదవోలు సీటు కేటాయించాలని డిమాండ్ చేయడంతో జోగయ్య పుత్రాభిమానం బహిర్గతమైంది. జోగయ్య స్కెచ్ అర్థం చేసుకున్న పవన్ ‌ఆయనకు రాజమండ్రిలో జరిగిన జెండా సభ వేదిక మీదనుంచి పరోక్షంగా వార్నింగ్ ఇవ్వడంతో తన కొడుకుని జగన్ పార్టీలోకి పంపిచేశారు జోగయ్య.

Also Read: విశాఖలో నమిత ప్రచారం, కూటమిదే గెలుపు

తర్వాత సూర్య ప్రకాష్ పవన్ మీద తీవ్ర విమర్శలు చేయడం చూస్తూ.. జోగయ్య కాపు సంక్షేమ సేన పెట్టింది కాపుల కోసం కాదు తన కుమారుడు కోసం అని విమర్శిస్తూ.. రాష్ట్రవ్యాప్తం గా ఉన్న సంక్షేమ సేన సభ్యులు రాజీనామాలు చేశారు. దాంతో ఆయన ఎన్నికల పూర్తయ్యే వరకు కాపు సంక్షేమ సేనకు తాత్కాలిక విరామాన్ని ప్రకటించారు. సేనకు బ్రేక్ ఇచ్చినా తాను మాత్రం వెనక్కి తగ్గనని పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తా. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే తన ధ్యేయమంటూ లేఖాస్త్రాలు సంధిస్తూనే వస్తున్నారు.

తనను కోవర్టుగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తుందని చేస్తుందని. పవణ్ ను సీఎం గా చూడాలని అప్పటి వరకూ తన పోరాటం ఆగదని హరిరామజోగయ్య పంచ్ డైలాగ్‌లు విసురుతున్నారు. అలాంటి సారు ఇప్పుడు పొలిటికల్ అనలిస్ట్ అవతారమెత్తారు. రేపటి ఎన్నికల ఫలితాలను ఇప్పుడే ప్రకటించేశారు

అంతేనా ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేశాక. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు పోషించబోయే పాత్రలపై కూడా ఆయన దగ్గర సమాచారం ఉందంట. కూటమి సర్కారులో టీడీపీ అధినేత వన్ ప్లేస్‌లో ఉంటే.. జనసేనాని సెకండ్ ప్లేస్‌లో ఉంటారంట

మరి జ్యోతిష్కుడి అవతారమెత్తిన జోగయ్య జోస్యం ఎంత వరకు ఫలిస్తుందో కాని .. తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసమే ఆయన కొత్త రోల్ పోషిస్తున్నారంటున్నారు. వైసీపీలో చేరిన తన కొడుక్కి సరైన ఫ్లాట్ ఫాం చూపించడానికి తాపత్రయపడుతున్నారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. కీడెంచి మేలెంచడం అంటారు ఇదేనేమో

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News