BigTV English

Sai Pallavi: సాయిపల్లవి ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా.. అప్డేట్స్ వచ్చేస్తున్నాయి

Sai Pallavi: సాయిపల్లవి ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా.. అప్డేట్స్ వచ్చేస్తున్నాయి

Sai Pallavi:ఫిదా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ సాయిపల్లవి. భానుమతి.. సింగిల్ పీస్ అని డైలాగ్ చెప్పడంతోనే కుర్రకారు ఫిదా అయిపోయారు. నిజంగానే ఈ భానుమతి ఇండస్ట్రీలోనే సింగిల్ పీస్ గా కొనసాగుతోంది. నో గ్లామర్ షోస్.. నో లిప్ కిస్.. నో కమర్షియల్ మూవీస్. పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్ప సాయిపల్లవి సినిమా ఒప్పుకోదు. తాను డబ్బు కోసం సినిమాలు చేయడం లేదని నిర్భయంగా చెప్పిన ఆమె.. కనీసం ఏ యాడ్ లో కూడా కనిపించింది లేదు. ఆమె వ్యక్తిత్వంతోనే అభిమానుల మనసులను గెలుచుకుంది.


ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సాయిపల్లవి పుట్టినరోజు రేపు. దీంతో సోషల్ మీడియాలో హంగామా మొదలైపోయింది. సాయిపల్లవికి సంబంధించిన అప్డేట్స్ రావడం కూడా స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం సాయిపల్లవి తెలుగులో తండేల్ మూవీలో నాగచైతన్య సరసన నటిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన లవ్ స్టోరీ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు తండేల్ తో ఈ జంట మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా బుజ్జి తల్లే.. కూసింత నవ్వరాదే అన్న డైలాగ్ అయితే ట్రెండ్ గా కూడా మారిపోయింది. ఇక రేపు సాయిపల్లవి పుట్టినరోజు కావడంతో.. ఆమె స్పెషల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటిస్తూ కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.


సముద్రం ఒడ్డున ఫోన్ లో మాట్లాడుతూ బుజ్జి తల్లి నవ్వులు చిందిస్తుంది. ఆమె పేరు సత్య అని తెలిపారు. ఈ వీడియోను రేపు ఉదయం 9.09 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.  ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. రేపు ఈ స్పెషల్ వీడియోలో సాయిపల్లవి డ్యాన్స్ ఉంటే బావుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఈ అప్డేట్ మాత్రమే కాకుండా తమిళ్ లో అసురన్, హిందీలో రామాయణ నుంచి కూడా పోస్టర్స్ వస్తాయని అభిమానులు వేచి చూస్తున్నారు. దీంతో సాయిపల్లవి ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా ట్రెండ్ చేయడానికి అంటూ నెటిజన్స్ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×