Big Stories

PM Modi Vs CM Jagan: మోదీ ధమ్కీ! జగన్ తుస్!!

PM MODI Comments on CM JAGAN(AP political news): గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రసంగాల్లో ఒకింత బేలతనం కనిపించింది. తన సహజశైలికి భిన్నంగా సభా వేదికల మీద నుంచి వంగివంగి దణ్ణాలు పెట్టి ఓట్ల కోసం అభ్యర్ధించారు టీడీపీ అధినేత ఇప్పుడు ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం లేదని వైసీపీ అధ్యక్షుడు అంటున్నారు. అంటే వైసీపీకి ఓటమి భయం పట్టుకుందా? ఇంత కాలం వైనాట్ 175 అని ధీమా వ్యక్తం చేసిన జగన్ వాయిస్‌ ఎందుకు మారింది? పోలింగ్ గడువు సమీపిస్తున్న తరుణంలో రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చేంటి?

- Advertisement -

వైసీపీ టార్గెట్‌గా ప్రధాని మోదీ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయిదేళ్లలో అంతా అవినీతి రాజ్యమే నడిచిందని.. అభివృద్ది లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. ఎన్డీయే మంత్రం అభివృద్ధి అయితే వైసీపీ మంత్రం అవినీతి అని ప్రధాని మోడీ ఆరోపించారు. ఏపీలో కూటమి తరపున రెండో సారి ప్రచారానికి వచ్చిన ప్రధాని ఏపీ కోసం కేంద్రం అనేక కార్యక్రమాలు చేపట్టినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏమీ చేయలేదని కేంద్ర పథకాలను వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగనివ్వలేదని మండిపడ్డారు. కేంద్రం విశాఖ రైల్వే జోన్ కేటాయిస్తే, వైసీపీ ప్రభుత్వం అందుకు అవసరమైన భూమిని కూడా ఇవ్వలేదని టార్గెట్ చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఉత్తారాంధ్ర సుజల స్రవంతి ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను జగన్ పూర్తి చేయలేకపోయారని. కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు 15 వేల కోట్లు విడుదల చేసినా ఆ పనులు జరగలేదని విమర్శలు గుప్పించారు.

- Advertisement -

జగన్ ఏపీని అప్పుల కుప్పగా మార్చారని చంద్రబాబు టైంలో ఏపీలో జరిగిందన్న మోడీ జగన్ పై నిప్పులు కురిపిస్తూ బాబు పై ప్రశంసలు కురిపించారు. మోడీ ఏపీలో ప్రచారానికి మొదటి సారి వచ్చినప్పుడు చిలకలూరిపేట సభలో వైసీపీని ఒక్క మాట కూడా అనలేదు. దాంతో టీడీపీ, బీజేపీ పొత్తుని వన్‌సైడ్ లవ్ అని పేర్కొంటూ చంద్రబాబున యద్దేవా చేశారు జగన్ టీడీపీ బీజేపీల పొత్తుపై సోషల్ మీడియా పోస్టులు హోరెత్తించాయి వైసీపీ శ్రేణులు.

Also Read: పవన్ పదవిపై జోగయ్య జోస్యం..

ఇప్పుడు చూస్తే సీన్ మారిపోయింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబుని ఏ రేంజ్లో టార్గెట్ చేశారో.. అంతకు మించి ఇప్పుడు జగన్‌పై ఫోకస్ పెట్టారు మోదీ.. ప్రధానికి కౌంటర్ ఇచ్చే పరిస్థితిలేని వైసీపీ ఇప్పుడు అయోమయంలో పడ్డట్లు కనిపిస్తుంది. మచిలీపట్నం సభలో ఎప్పటిలాగే చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన జగన్.. తనపై అవినీతి ముద్ర వేసిన ప్రధానిని పల్లెత్తు మాట అనే సాహసం చేయలేదు. 2014 నాటి టీడీపీ మ్యానిఫెస్టోని వెంట పెట్టుకుని తిరుగుతున్న సీఎం.. అప్పుడు టీడీపీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు.

కీలక అధికారులపై ఈసీ వేటు వేస్తుంది. జగన్ ఏరికోరి నియమించకున్న ఏపీ డీజీపీ, ఇంటలిజెన్స్ డీజీలపై కూడా బదిలీ వేటు పడింది. ఇక ఇప్పుడు మోదీ ఎదురుదాడి మొదలైంది. ఆ క్రమంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ మఖం మీద నవ్వు మాయమైంది. ప్రసంగాల్లో పదాలు తేడా కొడుతున్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయన్న నమ్మకం పోతుందని అధికారులను ఇష్టానుసారం మార్చేస్తున్నారని వాపోతున్నారు. వైసీపీలో అలజడి మొదలైందనడానికి అదే నిదర్శనం అంటున్నారు విశ్లేషకులు.

వైసీపీ అనుకున్న దాన్నికి భిన్నంగా ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది.. వలంటీర్లు, అధికార యంత్రాంగంతో చక్రం తిప్పవచ్చని అనుకున్న అధికారపక్షానికి అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయంటున్నారు. డీజీపీ, ఇంటలిజెన్స్ డీజీలను బదిలీ చేసిన క్రమంలో  ఛీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డిని కూడా ట్రాన్స్‌ఫర్ చేయాలని ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న సీఎస్‌పై కూడా వేటు పడుతుందన్న గుబులు వైసీపీ నాయకుల్లో కనిపిస్తుంది. ఆ ఆందోళన, అక్కసంతా ప్రధాని మోడీపై చూపించారు మంత్రి బొత్స.

మరోవైపు ఇంకా చాలా నియోజకవర్గాల్లో జగన్ ప్రచారం జరగలేదు. దాంతో ఆయా నియోజకవర్గాల అభ్యర్ధుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో జగనే స్వయంగా ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో  పార్టీ క్యాడర్ తీవ్ర గందరగోళానికి గురవుతున్నట్లు కనిపిస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News