Big Stories

PM Modi: అప్పుడలా.. ఇప్పుడిలా.. మోదీజీ! ఇలా ఎలా?

- Advertisement -

గుజరాత్‌లో ముస్లింలలోని 70 గ్రూప్‌లకు నేను రిజర్వేషన్స్‌ కల్పించాను. అది కూడా ఓబీసీ కేటగిరిలో.. యస్.. ఈ మాట అన్నది సాక్షాత్తు నరేంద్ర మోదీగారే.. 2022లో ఫిబ్రవరి 9న చేశారు ఈ వ్యాఖ్యలు. మాట్లాడి మర్చిపోయినట్టు ఉన్నారు. కానీ సోషల్ మీడియా మర్చిపోదు కదా.. అందుకే ఇప్పుడీ వ్యాఖ్యలు వైరలయ్యాయి. అప్పుడు మోడీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఎందుకింత సెన్సెషన్ అంటే.. గత కొన్ని రోజులుగా అదే మోడీ గారు దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.

- Advertisement -

అదేంటంటే.. ఈసారి మేము చెప్పడం కాదు. మీరే వినండి. విన్నారుగా.. ఓబీసీ కోటాలో నుంచి కాంగ్రెస్‌ ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తోంది అంటున్నారు మోదీ.. అది కూడా దొంగతనంగా ఈ పని చేస్తుంది అని చెబుతున్నారు. మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఓబీసీ రిజర్వేషన్లన్నీ వారికే కట్టబెడుతారని కూడా ఆరోపిస్తున్నారు.ఇదే కాస్త ఆశ్చర్యంగానూ, కన్‌ఫ్యూజన్‌గానూ ఉంది. ఎందుకంటే 2022లో మోడీ చెప్పిన మాటలకు.. ఎన్నికల ముందు ఇప్పుడు చెబుతున్న మాటలకు అస్సలు పోలికే లేదు. పోలిక లేకపోగా.. కంప్లీట్‌ రివర్స్‌లో ఉన్నాయి ఈ మాటలు.

Also Read: సోనియా వీడియో సందేశం, అలాంటి వారిని దూరంగా పెట్టండి?

అప్పుడు మోదీ ఏం చెప్పారు.. ముస్లింలలోని 70 గ్రూప్‌లకు ఓబీసీల కింద రిజర్వేషన్లు ఇచ్చానన్నారు.. అది కూడా తాను సీఎంగా ఉన్నప్పుడే.. మరి ఇప్పుడేమో ఇతర రాష్ట్రాల్లో ఇదే పనిని కాంగ్రెస్‌ పార్టీ చేస్తే దానిని తీవ్రంగా తప్పు పడుతున్నారు మోడీ.. మరి ఇదేంటన్నది అస్సలు అర్థం కావడం లేదు. మోడీ అప్పుడు ప్రధానిగానే ఉన్నారు.. ఇప్పుడు ప్రధానిగానే ఉన్నారు.

మరి ఎప్పుడు మాట్లాడిన మాటలు ప్రజలు విశ్వసించాలి.. ? ఏది నిజమని నమ్మాలి? దీనికి సమాధానం మోదీగారే చెప్పాలి.. కాసేపు ఈ విషయాన్ని పక్కన పెడదాం.. ఇదంతా పాస్ట్.. ఇప్పుడు ప్రజెంట్‌కి వద్దాం. NDAలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అందులో ఒకటి JDS.. దేవగౌడ పార్టీ మొన్న ఎన్నికల ప్రచారంలో ఒక విషయాన్ని గర్వంగా చెప్పుకుంది. ఏమనీ అంటే.. కర్ణాటకలో వెనకబడిన ముస్లిం వర్గాలకు తాము రిజర్వేషన్లు ఇచ్చామని.. ఇక రీసెంట్‌గా ఏపీలో కూటమిలో భాగమైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ అయితే అల్టిమేట్ అనే చెప్పాలి..

టీడీపీ అధినేత చంద్రబాబు అయితే ఏకంగా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇస్తామని బహిరంగంగానే చెబుతున్నారు. సో ఇదేం డబుల్ స్టాండ్.. మీరేమో.. నేనే రిజర్వేషన్లు ఇచ్చానంటారు. ఇప్పుడేమో.. అది తప్పంటారు. మీ కూటమి నేతలేమో ఇప్పటికీ మా ఓటు ముస్లిం రిజర్వేషన్లకే అంటున్నారు. మరి ఎవరిని మోసం చేయడానికి ఇదంతా అనేది సమాధానం లేని ప్రశ్న.. ఇదే కాదు.. మరో అంశం కూడా ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్లియర్‌ కట్‌గా వివరించారు. ఎట్ ది సేమ్‌ టైమ్ సవాల్ విసిరారు. రిజర్వేషన్లు రద్దు చేయాలన్నది మీ ఆలోచన కదా అని.. దీనికి కూడా ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేదు.. బీజేపీ నేతలు.. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికైనా నేతలు గుర్తుంచుకొని మాట్లాడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News