BigTV English

Alaska Dual Murder Case: నాలుగేళ్ల క్రితం జంటహత్యలు.. నిందితుడ్ని పట్టించిన ఎస్డీ కార్డు

Alaska Dual Murder Case: నాలుగేళ్ల క్రితం జంటహత్యలు.. నిందితుడ్ని పట్టించిన ఎస్డీ కార్డు
Today news paper telugu

Alaska Dual Murder News: వాహనంలో నుంచి ఓ మహిళ దొంగతనం చేసిన ఎస్డీ కార్డు నిందుతుడ్ని జైలుకు పంపింది. ఎస్డీ కార్డు వల్ల జంట హత్యల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ చోరీ, దాడులకు పాల్పడడం, వ్యభిచారం వంటి ఆరోపణలను ఎదుర్కొంటుంది. ఆ మహిళకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అతనితో ఆమె ఒకరోజు ట్రక్కులో ‘డేట్‌’కు వెళ్లింది. అనంతరం వాహనంలో అతను లేని సమయంలో ఎస్‌డీ కార్డును దొంగతనం చేసింది. ఎస్డీ కార్డు దొంగలించిన తర్వాత నాలుగేళ్లపాటు విషయాన్ని మరిచిపోయింది. ఇటీవల ఎస్డీ కార్డులోని దృశ్యాలను పరిశీలించింది.


ఆ కార్డులో ఉన్న దృశ్యాలను చూసి.. ఆ మహిళ బిత్తరపోయింది. సదరు వ్యక్తి ఒక మహిళను హత్య చేస్తున్న దృశ్యాలు ఆ కార్డులో నమోదు అయ్యాయి. హత్య చేస్తున్న దారుణమైన ఫొటోలు, వీడియోలు అందులో రికార్డు అయ్యాయి. దీంతో ఆమె వెంటనే ఆ కార్డును పోలీసులకు అప్పగించింది. ఆ వ్యక్తి మహిళను దారుణంగా కొట్టి హింసించాడు. తర్వాత ఆమె గొంతు కోసాడు. అతను ఆవేశంతో.. ఆమెను చనిపోవాలని గట్టిగా అరవడం వంటి దృశ్యాలు అందులో నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. ఆమె మృతదేహన్ని దుప్పట్లో చుట్టి బయట లగేజ్‌ కార్ట్‌ వద్ద పడేసి ఉండడం కనిపించింది.

ఆ దృశ్యాల్లోని ఉన్న వ్యక్తి గొంతు బ్రియన్‌ స్టీవెన్‌ స్మిత్‌ (52)గా పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. అతనిపై హత్య, వివిధ నేర అభియోగ కేసులు నమోదై ఉన్నాయి. అయితే అలస్కాకు చెందిన మహిళలు కాథ్లీన్‌ హెన్రీ (30), వెరోనికా అబౌచుక్‌ (52)ల హత్యలు సహా మొత్తం 14 అభియోగాల్లో తాను నిందితుడ్ని కాదంటూ గతంలో స్మిత్‌ వాదించాడు. కాథ్లీన్ హెన్రీని హత్య చేస్తున్నప్పటి దృశ్యాలు యాంకరేజ్‌లోని ‘టౌన్‌ప్లేస్‌ సూట్స్‌’లో రికార్డ్ అయ్యాయి. గతంలో స్మిత్‌ 2019 సెప్టెంబరు 2 నుంచి సెప్టెంబర్ 4 తేది వరకు ఆ హోటల్‌లో ఉండేందుకు రూమ్ బుక్‌ చేసుకున్నాడు. కాథ్లీన్ హెన్రీ హత్యకు సంబంధించి ఎస్డీ కార్డులో దృశ్యాలను పోలీసులు పూర్తిగా పరిశీలించారు. ఆ తర్వాత స్మిత్‌ను పోలీసులు విచారించారు. తమ దైన శైలిలో పోలీసులు విచారించగా చివరకు అతను వెరోనికా హత్యకు సంబంధించిన విషయాలు సైతం వెల్లడించారు. దీనిపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు.


Related News

Nobel Peace Prize 2025: నోబెల్ శాంతి బహుమతి ట్రంప్ నకు అంకితం.. మరియా కొరీనా కీలక ప్రకటన

Worlds Largest Cargo Plane: శంషాబాద్‌లో ప్రపంచంలోనే.. అతిపెద్ద కార్గో విమానం

Donald Trump: 8 యుద్ధాలు ఆపిన నాకు నోబెల్ ఇవ్వరా? పాపం, ట్రంప్ మామ బాగా హర్ట్ అయ్యాడు కాబోలు

Nobel Prize Peace: ట్రంప్‌‌కు బిగ్ షాక్.. నోబెల్ శాంతి బహుమతి ఎవరికంటే..?

Donald Trump: నోబెల్ శాంతి బహుమతి రేసులో డొనాల్డ్ ట్రంప్ కల నెరవేరేనా?

Nobel Prize: నోబెల్ గెలిచిన వారికి ప్రైజ్ మనీ ఎంత..? వారికి లభించే గుర్తింపు ఏంటి..?

Tourist Tax: థాయ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం..! టూరిస్ట్ ట్యాక్స్ విధించేందుకు సిద్ధం..?

Nobel Prize Chemistry: కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఇదిగో వారి పేర్లు

Big Stories

×