BigTV English
Advertisement

Kapu Politics In AP: కాపు రాజకీయం.. ముద్రగడ vs మెగా ఫ్యామిలీ

Kapu Politics In AP:  కాపు రాజకీయం.. ముద్రగడ vs మెగా ఫ్యామిలీ

ముద్రగడ పద్మనాభానికి కోప మొచ్చింది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఫుల్ ఫైర్ అయ్యారు. నిజానికి ఇవి చాలా తీవ్ర విమర్శలు. మాములుగా ఇప్పటి వరకు పవన్ వ్యవహారశైలిపై విమర్శలు చేస్తూ వస్తున్న ముద్రగడ. ఇప్పుడు గేర్ మార్చారు. ఆయన భార్యలను కూడా రాజకీయాలకు లాగారు. అంతేకాదు. మెగా ఫ్యామిలీపై కూడా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు ముద్రగడ.

విన్నారుగా.. ప్రస్తుత విషయాలే కాదు. గతంలో మెగా ఫ్యామిలీపై చేసిన విమర్శలను కూడా తెరపైకి తీసుకొచ్చారు ముద్రగడ.. మరి ఆయన ఈ రేంజ్‌లో రెచ్చిపోవడానికి రీజన్సేంటి? అసలు ఆయన అంతలా కోపంతో ఊగిపోవడానికి రీజన్సేంటి? ఈ క్వశ్చన్‌కు ఆన్సర్ ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే మీరు ఇది చూడాల్సిందే.. అదీ సంగతి.. పవన్‌ కల్యాణ్‌ చేసిన ఈ పనే ముద్రగడ కోపం నషాళాన్ని అంటడానికి కారణం.. పవన్ ఇక్కడ ముద్రగడ గురించి అసభ్యంగా మాట్లాడారా?.. లేదు.. ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారా?.. లేదు.


Also Read: సొంత బంధువులే శత్రువులు.. డిప్యూటీలా ఫ్రస్టేషన్

బట్ పవన్ తుని సభలో చేసిన ఈ పని చూడటానికి పెద్దరికంలా కనిపిస్తున్న ఇది ప్యూర్ పొలిటికల్ స్టంట్.. రాజకీయాలపై ఏ కాస్త అవగాహన ఉన్నా.. ఇది అర్థమయ్యే విషయం.. ఎందుకు అంటే.. ముద్రగడ ప్రస్తుతం వైసీపీ క్యాంప్‌లో ఉన్నారు. పిఠాపురంలో పవన్ ఓటమి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.నిత్యం అక్కడి కాపు నేతలు, ప్రజలతో టచ్‌లో ఉంటున్నారు. పిఠాపురంలోనే మకాం వేసి రాజకీయాలను నడుపుతున్నారు. ఇది ముమ్మాటికీ జనసేనతో పాటు కూటమి నేతలకు ఎఫెక్ట్ చూపించేదే.. సో దీనికి కౌంటర్‌గా జనసేన వ్యూహకర్తలు కొత్త వ్యూహాన్ని రచించారు.

తుని సభలో ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి ప్రత్యక్షమయ్యారు.
ఆమెను ముద్రగడ పద్మనాభం కూతురు అని ఇంట్రడ్యూస్ చేశారు పవన్.
అదే సమయంలో ముద్రగడ పెద్దవారు.. ఆయన కోపంతో నాలుగు మాటలు అనవచ్చు అంటూ స్పీచ్ ఇచ్చేశారు పవన్.. సింపుల్‌గా చెప్పాలంటే ముద్రగడ అభిమానుల మనసు దోచుకునే ప్రయత్నం చేశారు పవన్.. అంతేకాదు ముద్రగడ కుటుంబ సభ్యుల మద్దతు కూడా నాకే ఉందని చెప్పకనే చెప్పేశారు పవన్.. ఈ విషయమే ముద్రగడ కోపానికి అసలు కారణం. అందుకే ఆయన ఈ స్థాయిలో పవన్‌ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు. పవన్ సినిమాల్లో నటించమంటే.. రాజకీయాల్లో కూడా అదే చేస్తున్నారని.. తన పేరుతో రాజకీయం చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు.

Also Read: అక్కాచెల్లెళ్ల అటాక్‌.. ఆస్తి వివాదాలే కారణమా?

నిజానికి ఉభయ గోదావరి జిల్లాల్లో కాపుల ప్రభావం ఎక్కువ.. అందుకే చంద్రబాబు కూడా ఎక్కువ సీట్లు ఈ జిల్లాల్లోనే ఇచ్చారన్న ప్రచారం కూడా ఉంది. కానీ ముద్రగడ వైసీపీలో చేరడంతో ఇప్పుడు ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. అయితే పవన్‌ ఈ వ్యూహంతో ముద్రగడకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే రాజకీయం కోసం తన కుటుంబంలో చిచ్చు పెడుతున్నారంటూ ముద్రగడ కూడా అదే స్థాయిలో సెంటిమెంట్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఎందుకంటే రెండు రోజుల క్రితం పవన్‌కు అనుకూలంగా ఓ వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేశారు క్రాంతి.

అందుకే ముద్రగడ కూడా పవన్‌ను మాత్రమే కాకుండా.. మొత్తం మెగా కాంపౌండ్‌ను లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. సో ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి ఎవరైనా తీవ్రంగా రియాక్టవుతే మాత్రం కాపు రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమవడం ఖాయం.. ఎందుకంటే ముద్రగడ చేసిన స్థాయిలో మళ్లీ అటక్‌ చేయాలంటే అది కాపు నేతే అయ్యిండాలి. అదే జరిగితే కాపు నేతల్లో పూర్తిగా కాకపోయినా.. కాస్తైనా విభజన రావడం ఖాయం.. అది రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

Tags

Related News

Nalgonda leaders: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు

Proddatur: ప్రొద్దుటూరు క్యాసినో వార్

Jubilee Hills: జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? ఏం తేలిందంటే!

Jubilee Hills Bypoll: బాబు, పవన్‌లపైనే బీజేపీ ఆశలు!

India VS Pakistan: పవర్‌ఫుల్‌గా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్! యుద్ధం ఖాయమేనా?

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో.. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Big Stories

×