BigTV English

Kiraak RP on Minister Roja: నీ బతుక్కి ఎన్ని అవార్డులు అందుకున్నావ్.. రోజాపై ఫైర్ అయిన జబర్దస్త్ కిర్రాక్ ఆర్పీ!

Kiraak RP on Minister Roja: నీ బతుక్కి ఎన్ని అవార్డులు అందుకున్నావ్.. రోజాపై ఫైర్ అయిన జబర్దస్త్ కిర్రాక్ ఆర్పీ!

Kiraak RP Sensational Comments on Minister Roja: జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన నటుల్లో కిర్రాక్ ఆర్పీ ఒకడు. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి నెల్లూరు చేపల పులుసు పేరుతో ఫుడ్ బిజినెస్ లోకి దిగి భారీగా సంపాదిస్తున్నాడు. ఒక్క బ్రాంచ్ తో మొదలైన ఆర్పీ బిజినెస్ ఇప్పుడు అన్ని చోట్లా ఓపెన్ చేసి నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. ఇక కిర్రాక్ ఆర్పీ ఏది మాట్లాడినా నిర్మొహమాటంగా మాట్లాడతాడు. ఏది చెప్పినా భయం లేకుండా మనసులో అనుకున్నది చెప్తాడు. తాజాగా ఆర్పీ.. ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. జనసేన తరుపున ఆయన పవన్ కు సపోర్ట్ గా నిలబడ్డాడు.


ఇక ఈ మధ్య మినిస్టర్ రోజా.. జబర్దస్త్ ఆర్టిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. పవన్ కు సపోర్ట్ గా ఉన్న జబర్దస్త్ నటులను చిన్న ఆర్టిస్టు లని, మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేయకపోతే వారికి సినిమాలు ఉండవని మాట్లాడింది. ఇక ఈ మాటలపై కిర్రాక్ ఆర్పీ ఫైర్ అయ్యాడు. ” మమ్మల్ని గౌరవిస్తే మేము రోజా గారు అంటాం.. మాకు గౌరవం లేకపోతే రోజా అనే అంటాం. ఆమె ఏం మాట్లాడింది.. మేమందరం జనసేనకు ప్రచారం చేస్తున్నాం అని మాట్లాడింది.

మేమేమో చిన్న చిన్న ప్రాణాలు అంట.. చిన్న చిన్న ఆర్టిస్టులు అంట. ఈవిడేమైనా నేషనల్ వైడ్ ఆర్టిస్టా.. ? 15 అవార్డులు కొట్టిందా.. ? ఓ 20 ఆస్కార్ అవార్డులు కొట్టిందా యువరాణి. పవన్ కళ్యాణ్ గారిమీద ఇష్టం ఉండి వాళ్లేదో చేసుకుంటున్నారు. చిన్న చిన్న ఆర్టిస్టులు అంటున్నావ్.. నీకు దమ్ముంటే.. గెటప్ శ్రీను వేసే క్యారెక్టర్ లా నీ జీవితంలో చేయగలిగావా.. ? సుధీర్ మ్యాజిక్ షో చేసుకుంటూ పైకి వచ్చి హీరో అయ్యాడు. అతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ నీకు ఉందా.. ? వాడితో నువ్వు పోటీ పడగలవా.. ? హైపర్ ఆది వచ్చి జబర్దస్త్ చరిత్ర మార్చాడు. వాడితో నువ్వు పోటీ పడగలవా.. ? నీ బతుకులో ఈ ముగ్గురిలాంటి చరిష్మా చూసావా.. ? నిన్ను ఎవరు ఏం అన్నప్పుడు ఎందుకు నీకు ఉలికి ఉలికి పడుతున్నావ్. ఈసారి నగరిలో డిపాజిట్లు కూడా రావు.


Also Read: HBD Vijay Deverakonda: కత్తి నాదే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే.. విజయ్ దేవరకొండ కొత్త మూవీ పోస్టర్ అదుర్స్

7 మంది హీరోలు ఉన్నారు అంటున్నావ్ .. మీ జగన్ అన్న వెనుక 70 మంది రౌడీలు ఉన్నారు. ఎదురించి చూడు నిన్ను లేపేస్తాడేమో చూద్దాం. ప్రతిదానికి నీలా దిగజారి బతుకుతున్నారు అనుకున్నావా.. నోరు మూసుకొని నీ పని నువ్వు చేసుకో.. నువ్వు ప్రచారం చేసినా చేయకపోయినా ఓడిపోతావ్. కనీసం జనసేనకు వచ్చి మద్దతు పలుకు నీ బతుకు బావుంటుంది” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×