E-Paper
Advertisement

Internship: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. నీతి ఆయోగ్‌లో ఇంటర్న్‌షిప్ ఛాన్స్..

Internship: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. నీతి ఆయోగ్‌లో ఇంటర్న్‌షిప్ ఛాన్స్..

Internship: నిరుద్యోగులకు శుభవార్త. ఇంటర్న్ షిప్ కావాలనుకునే వారికి నీతి ఆయోగ్ శుభవార్త తెలిపింది. దేశ ఆర్థిక అభివృద్ధికి పాలసీలను రూపొందించే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నీతి ఆయోగ్ తాజాగా ఇంటర్న్ షిప్ ప్రోగ్రాంను ప్రారంభించింది. ఈ మేరకు దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది.

అండర్ గ్రాడ్యెయేట్, పోస్టు గ్రాడ్యుయేట్, రీసెర్చ్ స్కాలర్స్ నీతి ఆయోగ్ ఇంటర్న్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు అధికారిక వెబ్ సైట్ workforindia.niti.gov.in/intern/InternshipEntry/homepage.aspx ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి మే 10వ తేదీని చివరి తేదీగా నిర్ణయించింది. అభ్యర్థులు దరఖాస్తు పరిశీలించి రాతపరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.

గడువు..

ఈ స్కాలర్ షిప్ కోసం ఎంపికైన అభ్యర్థులు నీతి ఆయోగ్ సెల్స్, డిపార్ట్మెంట్‌లలో పనిచేయాల్సి ఉంటుంది. దీనికి దరఖాస్తు చేసుకునేందుకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ఇంటర్న్ షిప్ వ్యవధి 6 వారాల నుంచి 6 నెలల వరకు ఉంటుందని పేర్కొంది.

జాబితా..

ఈ నీతి ఆయోగ్ స్కాలర్ షిప్ లో డొమైన్స్ కూడా ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. ఇందులో డేటా మేనేజ్మెంట్, వ్యవసాయం, అనాలసిస్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, మౌలిక సదుపాయాల కనెక్టివిటీ, మాస్ కమ్యూనికేషన్స్, సోషల్ మీడియా, సహజ వనరులు, పబ్లిక్ ఫైనాన్స్ బడ్జెట్, సోషల్ జస్టిస్ అండ్ ఎంపంర్మెంట్, స్పోర్ట్స్ అండ్ యూత్ డెవలప్మెంట్, టూరిజం అండ్ కల్చర్, నీటి వనరులు, పరిశ్రమలు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫెర్ వంటి వివిధ విభాగాలలో అభ్యర్థులు ఎంపిక చేసుకోవచ్చు.

అర్హత

అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, గ్రాడ్యుయేట్ విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. నాలుగో సెమిస్టర్ పరీక్షలు లేదా రెండో సంవత్సరం పూర్తి చేసి ఉండాలి. ఇంటర్ లో కనీసం 85 శాతం మార్కులతో పాస్ అయి ఉండాలి. మరోవైపు అండర్ గ్రాడ్యుయేట్ లో కనీసం 70 శాతం మార్కులతో పాస్ అయి ఉండాలని నిర్ణయించారు. పీజీలో కనీసం 70 శాతం మార్కులు సాధించి ఉండాలి.

Tags

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×