
Janhvi kapoor (Source: Instragram)
జాన్వీ కపూర్.. దివంగత నటీమణి, అతిలోక సుందరి అందాల తార శ్రీదేవి, ప్రముఖ నిర్మాత బోనీకపూర్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.

Janhvi kapoor (Source: Instragram)
బాలీవుడ్ లో పలు చిత్రాలలో నటించడమే కాకుండా కొన్ని ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా పనిచేసి.. తనకంటూ ఒక పేరును అందుకుంది. అక్కడే పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది కూడా.

Janhvi kapoor (Source: Instragram)
బాలీవుడ్లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా కూడా పేరు దక్కించుకున్న ఈమె.. ఇటు టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజిలో రెమ్యూనరేషన్ అందుకొని అందరిని ఆశ్చర్యపరిచింది.

Janhvi kapoor (Source: Instragram)
అలా ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన దేవర సినిమాకి ఏకంగా ఐదు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు పెద్ది సినిమాలో నటిస్తోంది.

Janhvi kapoor (Source: Instragram)
తాజాగా ఈ సినిమా నుండి చికిరి అంటూ ఒక పాట రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలవడంతో ఇటు జాన్వీ కపూర్ కూడా ఈ పాటను హైలైట్ చేస్తూ తన అందాలతో మాస్ జాతర చేసింది.

Janhvi kapoor (Source: Instragram)
గోల్డెన్ కలర్ డ్రెస్ లో ఒకవైపు.. మరొకవైపు శారీలో తన అందాలను ఆరబోస్తూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది. రాత్రివేళ గ్లామర్ డోస్ పెంచేసి పిచ్చెక్కిస్తోంది జాన్వి అంటూ ఫాలోవర్స్ కామెంట్లు చేస్తున్నారు.