
Aditi Rao hydari (Source: Instragram)
అదితి రావు హైదరి.. అందానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈమె ఎక్కువగా బాలీవుడ్ , కోలీవుడ్ చిత్రాలలో నటించి మంచి పేరు అందుకుంది.

Aditi Rao hydari (Source: Instragram)
అస్సాం గవర్నర్ గా పనిచేసిన మహమ్మద్ సలేహ్ అక్బర్ హైదరి, హైదరాబాద్ కి చెందిన జానంపల్లి రామేశ్వరరావు కుటుంబంలో జన్మించింది. వీరిద్దరిది కూడా రాజు కుటుంబమే కావడం గమనార్హం.

Aditi Rao hydari (Source: Instragram)
అలా రాజకుటుంబం నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. సినిమాలలో మక్కువతో 2006లో మమ్ముట్టి సరసన మలయాళ చిత్రం ప్రజాపతి సినిమాతో అరంగేట్రం చేసింది.
ఈ సినిమాలో దేవదాసి పాత్రలో నటించి తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

Aditi Rao hydari (Source: Instragram)
ఈమె వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 2002లో సత్య దీప్ మిశ్రా ను వివాహం చేసుకొని ఆ తర్వాత 2012లో విడాకులు తీసుకున్నారు.

Aditi Rao hydari (Source: Instragram)
తర్వాత ప్రముఖ నటుడు సిద్ధార్థుని 2024 మార్చి 27న వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ లోని 400 సంవత్సరాల చరిత్ర కలిగిన రంగనాథ స్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు.

Aditi Rao hydari (Source: Instragram)
ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా బ్లాక్ అండ్ వైట్ చుక్కలు కలిగిన గౌను ధరించి అందులో క్యూట్ లుక్స్ తో అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.