
Pawan Kalyan Photos (Source: Instagram)
Pawan Kalyan Look Viral : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నారు. ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం చూసిన ఆయన ఫోటోలు, వీడియోలే దర్శనం ఇస్తున్నాయి.

Pawan Kalyan Photos (Source: Instagram)
ప్రస్తుతం ఆయన సినిమాలేవి రిలీజ్ లేవు. ఆయినా ఆయన సెంటరాఫ్ అట్రాక్షన్‌గా అవుతున్నారు. దీనికి డిప్యూటీ సీఎం గారి స్టైలిష్ లుక్.

Pawan Kalyan Photos (Source: Instagram)
మొన్నటి వరకు సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న ఆయన ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా, పర్యావరణ ఆటవి శాఖ మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎక్కడ సమస్య ఉన్న నేరుగా వెళ్లి పరిశీలిస్తున్నారు.

Pawan Kalyan Photos (Source: Instagram)
ఈ క్రమంలో ఫార్మల్ వేర్లో తన లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. దీంతో స్టైలిష్ డిప్యూటీ సీఎం అంటూ పవర్ వీడియోలు, ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

Pawan Kalyan Photos (Source: Instagram)
ఈ క్రమంలో ఆయన తాజాగా తిరుపతి జిల్లా మామండూరు అడవిలో పర్యటించారు. అక్కడ ఎర్రచందనం చెట్లను పరివీలించారు. అడవిలో నాలుగు కిలోమీటర్ల మేర ప్రయాణంలో రెండు కిలోమిటర్లు కాలినడక వెళ్లి ప్రతి చెట్టుని సమీక్షించారు.

Pawan Kalyan Photos (Source: Instagram)
ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనబడే అరుదైన మొక్కలు పరిశీలించి అటవీ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. నేపిరయర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుంచి మొత్తం అటవీ ప్రాంతం మొత్తం పరిశీలించారు.

Pawan Kalyan Photos (Source: Instagram)
వెలిగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణ ముఖీ నది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది? తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. గుంటి మడుగు వాగు ఒడ్డున కూర్చుని, పరిసరాలను ఆసక్తిగా తిలకించారు.

Pawan Kalyan Photos (Source: Instagram)
వాగుకి ఇరు వైపులా ఉన్న చెట్ల వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ లుక్ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఆయన బ్లాక్ టి-షర్టు కార్గో పాయింట్ ధరించి స్టైలిష్‌గా కనిపించారు.

Pawan Kalyan Photos (Source: Instagram)
అడవిలో ఉన్న స్టార్ స్టారే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఈ లుక్‌లో పవన్ చూసి స్వాగ్ కా బాప్ అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సోషల్ మీడియాలో అట్రాక్షన్‌గా నిలిచింది.

Pawan Kalyan Photos (Source: Instagram)
కాగా ప్రస్తుతం ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఇది ఉస్తాద్ భగత్ సింగ్ అని తెలుస్తోంది. కాగా చివరిగా ఆయన ఓజీ మూవీతో అలరించారు.

Pawan Kalyan Photos (Source: Instagram)
ఈ సినిమా మొత్తం రూ. 500లకు పైగా కోట్ల కలెక్షన్స్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు పవన్ కెరీర్ వందకోట్ల మార్క్ దాటిన తొలి చిత్రంగా ఓజీ మూవీ మైలుస్టోన్గా నిలిచింది.