Anupama Parameswaran Images (Source: Instagram)
Anupama Parameswarn Latest Photos: అనుపపరమేశ్వరన్ ప్రస్తుతం బైసన్ మూవీ సక్సెస్ జోష్లో ఉంది. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో విక్రమ్ తనయుడు ధ్రవ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అనుపమ హీరోయిన్గా నటించింది.

Anupama Parameswaran Images (Source: Instagram)
ఇటీవల థియేటర్లలోకి వచ్చింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ సాగిన ఈ సినిమా తెలుగు, తమిళ్లో విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మధ్య వరుస ప్లాప్స్ లో ఉన్న అనుమపకు బైసన్ మూవీ హిట్ ఆమెలో కొత్త జోష్ నింపింది.

Anupama Parameswaran Images (Source: Instagram)
ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ మీట్స్, ఇంటర్య్వూలో బిజీ అయిపోయిన ఈ టిల్లుగాడి లిల్లి ప్రమోషనల్ ఫోటోషూట్స్ లో పాల్గొంది. తాజాగా సిల్కి బ్లూ డ్రెస్లో వయ్యారంగా హోయలు పోయింది.

Anupama Parameswaran Images (Source: Instagram)
కత్తిలాంటి కళ్లతో మత్తెక్కించేలా కుర్రాళ్లకు వల వేసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఆమె ఫోటోలకు నెటిజన్స్, ఫాలోవర్స్ ఫిదా అవుతున్నారు.

Anupama Parameswaran Images (Source: Instagram)
కాగా 'ప్రేమమ్' మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైంది అనుపమ పరమేశ్వరన్.. మొదట తమిళ మూవీ 'కోడి' తో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.. తెలుగులో వరుసగా సినిమాలు చేసింది.

Anupama Parameswaran Images (Source: Instagram)
ప్రేమమ్, అఆ, నటసార్వభౌమ, ఉన్నది ఒక్కటే జిందగీ, కార్తికేయ 2, టిల్లు స్వ్కేర్ వంటి సినిమాల్లో అవకాశం కొట్టేసి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.. టిల్లు స్క్వేర్ తో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.

Anupama Parameswaran Images (Source: Instagram)
కానీ స్టార్ ఇమేజ్ మాత్రం దక్కలేదు. ఇప్పటిదాకా హిట్ సినిమాల్లో కూడా నటించింది.. ఈ మధ్య సక్సెస్ సినిమాలు పడలేదు..