OTT Movie : మీరా నాయర్ అనే ఇండియన్ డైరెక్టర్ కొడుకు జోహ్రాన్ మామ్డానీ 2025 నవంబర్ 5న న్యూయార్క్ సిటీ మేయర్‌గా గెలిచాడు. ఇది చాలా బిగ్ న్యూస్! న్యూయార్క్ చరిత్రలో మొదటి సారిగా సౌత్ ఏషియన్ (ఇండియన్ రూట్స్), ఆఫ్రికన్‌లో పుట్టిన వ్యక్తి మేయర్ అయ్యాడు. దీంతో మీరా నాయర్ పేరు ఒక్క సారిగా వార్తలో నిలిచింది. ఈమె సలాం బాంబే, మాన్సూన్ వెడ్డింగ్ లాంటి సినిమాలు తీసిన ఫేమస్ డైరెక్టర్. ఉగాండా ప్రొఫెసర్ మహమూద్ మామ్డానీని వివాహం చేసుకుంది. ఈ జంట కొడుకే జోహ్రాన్ మామ్డానీ.
జోహ్రాన్ డెమోక్రటిక్ సోషలిస్ట్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచాడు. ఫ్రీ బస్సులు, ఇంటి రెంట్ పెంచకుండా ఫ్రీజ్ చేయడం, యంగ్ వోటర్స్‌కి మంచి ప్లాన్స్ చెప్పి గెలుపొందాడు. మీరా నాయర్ ఇన్‌స్టాగ్రామ్‌లో సారీ వేసుకుని ఒక ఫోటో పోస్ట్ కూడా చేసింది. ఆమె 1988లో సలాం బాంబే సినిమాకి కేన్స్ అవార్డు గెలిచినప్పుడు కూడా సారీ వేసుకుని వెళ్లిందట. ఇప్పుడు ఆమె కొడుకు న్యూయార్క్ సిటీ మేయర్ కావడం ఇండియన్స్ గర్వించదగ్గ విషయం. దీంతో ఇప్పుడు మీరా నాయర్ సినిమాలు మళ్లీ ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు ఆమె సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయో, వాటి వివరాలు ఏమిటో ? ఒక సారి తెలుసుకుందాం పదండి.
1988లో మీరా నాయర్ తన మొదటి సినిమా ‘సలాం బాంబే’ తోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. ముంబై రోడ్ల మీద బతుకుతున్న చిన్న పిల్లల లైఫ్, డ్రగ్స్, దొంగతనం, వేశ్యలు మధ్య ఒక పిల్లాడి కష్టాలతో ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమాని రియల్ స్ట్రీట్ కిడ్స్‌తో షూట్ చేశారు. ఆస్కార్ నామినేషన్ కి కూడా ఈ సినిమా వెళ్ళింది. కేన్స్ ఫెస్టివల్‌లో అవార్డును కూడా గెలిచింది. ఐయండిబిలో 8/10 రేటింగ్ ఉన్న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.
1996 లో వచ్చిన ఈ సినిమా, పాత కాలం ఇండియాలో (16వ శతాబ్దం) సెట్ చేయబడింది. మాయా, తారా అనే ఇద్దరమ్మాయిల మధ్య జరిగే లవ్ స్టోరీ తో ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమాలో హాట్ సీన్స్ హద్దులు దాటడంతో ఇండియాలో సెన్సార్ బోర్డ్ చాలా కట్ చేసింది. బో*ల్డ్ సినిమా లవర్స్‌కి ఈ సినిమా పర్ఫెక్ట్ గా ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఐయండిబిలో 6/10 రేటింగ్ ని పొందింది.
ఇర్ఫాన్ ఖాన్, తబు మెయిన్ లీడ్స్ లో నటించిన ఈ సినిమా 2006లో వచ్చింది. ఈ కథ ఒక బెంగాలీ ఫ్యామిలీ అమెరికాకి వెళ్లి సెటిల్ అవ్వడంతో మొదలవుతుంది. ఈ ఫ్యామిలిలో ఉండే గోగోల్ అనే అబ్బాయి, ఇండియన్ కల్చర్ vs అమెరికన్ కల్చర్ మధ్య కన్‌ఫ్యూజ్ అవుతాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. ఇర్ఫాన్ యాక్టింగ్ ఈ సినిమాకి హైలెట్ గానిలిచింది. హాట్‌స్టార్‌లో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఐయండిబిలో 7.5/10 రేటింగ్ ని పొందింది.
2001 లో వచ్చిన ఈ సినిమా కథ, ఢిల్లీలో జరిగే ఒక పంజాబీ ఫ్యామిలీలో అరేంజ్డ్ మ్యారేజ్ చుట్టూ తిరుగుతుంది. ఇందులో నసీరుద్దీన్ షా ఫాదర్ గా, విజయ్ రాజ్ వెడ్డింగ్ ప్లానర్ గా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. వర్షాకాలంలో సాగే ఈ కథ గ్లోబల్ హిట్ గా నిలిచింది. ఇది వెనిస్ ఫెస్టివల్‌లో గోల్డెన్ లయన్ అవార్డును కూడా గెలిచింది. 7.3/10 ఐయండిబి రేటింగ్ తో ఈ సినిమా, నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
1991 లో వచ్చిన ఈ సినిమా కథ, ఒక ఇండియన్ అమ్మాయి & అమెరికన్ బాయ్ మధ్య జరిగే లవ్ స్టోరీ చుట్టూ తిరుగుతుంది. ఇందులో కల్చర్ ప్రాబ్లమ్స్ చాలా డీప్‌గా చూపిస్తారు. ఈ సినిమా 6.7/10 రేటింగ్ తో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. రొమాంటిక్ లవర్స్‌కి ఈ మూవీ బెస్ట్ సజెషన్.
వీటితో పాటు మీరా నాయర్ రూపొందించిన “ఎ సూటబుల్ బాయ్” అనే వెబ్ సిరీస్ కూడా ప్రైమ్ వీడియోలో ఉంది. ఇందులో ఇషాన్ ఖట్టర్, తబు యాక్టింగ్ కి ప్రశంసలు కూడా వచ్చాయి. మీరా నాయర్ సినిమాలు ఎప్పుడూ ఇమ్మిగ్రెంట్ లైఫ్, మహిళలు, కల్చర్ క్లాష్ మీద ఉంటాయి. ఇప్పుడు జోహ్రాన్ గెలుపుతో మళ్లీ అందరూ వీటిని చూడటానికి ఆసక్తి చూస్తున్నారు.
Read Also : దసరా ఉత్సవాలపై 40 నిమిషాల మూవీ…. ‘ప్రొద్దుటూరు దసరా’ ఏ ఓటీటీలో ఉందో తెలుసా?