
Aditi Rao Hydari Images (Source: Instagram)
Aditi Rao Hydari Latest Photos: అదితి రావు హైదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అసవరం లేదు. హైదరాబాద్ అమ్మాయైన అదితి మొదట బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఢిల్లీ 6 (Delhi 6) చిత్రంతో హిందీలో అడుగుపెట్టింది.

Aditi Rao Hydari Images (Source: Instagram)
ఆ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ భామకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. బాలీవుడ్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసిన అదితి.. సమ్మోహనం మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి మూవీతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

Aditi Rao Hydari Images (Source: Instagram)
ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అదితి తన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత అంతరిక్షం, మహా సముద్రం వంటి చిత్రాలతో మెప్పించింది. అయితే తర్వాత పెద్దగా తెలుగు సినిమాలు చేయలేదు.

Aditi Rao Hydari Images (Source: Instagram)
కానీ, హిందీలో అప్పుడప్పుడు మెరుస్తుంది. రీఎంట్ సంజన్ లీలా భన్సాలి హిరామండి వెబ్ సరీస్‌లో మెరిసింది. ఈ సిరీస్‌లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. గతేడాది హీరో సిద్దార్థ్‌ని ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Aditi Rao Hydari Images (Source: Instagram)
అయితే సోషల్ మీడియాకు చాలా అరుదుగా వచ్చే ఈ భామ తాజాగా తన ఫోటోలు షేర్ చేసింది. బ్రైడ్ సైడ్ సీజన్ 5 అంటూ షేర్ చేసిన ఈ ఫోటోల్లో అదితి పెళ్లి కూతురిలో ముస్తాబైంది. డిజైన్ లెహంగాలో ఈ భామ అందంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.