Srinivas Reddy: సాధారణంగా ఒక డైరెక్టర్ మంచి విజయం అందుకుంటే ఆయనతో సినిమాలు చేయడానికి చాలామంది హీరోలు, హీరోయిన్లు ఆసక్తి కనబరుస్తారు. అలా సరైన కథ దొరికితే మాత్రం మళ్లీ ఆ డైరెక్టర్ ఖాతాలో హిట్టు పడుతుంది. ఒకవేళ కథ బెడిసి కొడితే మాత్రం అది డిజాస్టర్ గా మిగలాల్సిందే. మరొకవైపు తమ కెరియర్ కు పునాదులు వేసిన హీరోలు ఏదైనా అడిగితే కాదనలేక కొంతమంది దర్శకులు సినిమాలు చేయడానికి ఒప్పుకుంటారు. పూర్తిగా సినిమా సెట్ పైకి వెళ్లే వరకు కష్టపడ్డాక.. అనుకోని కారణాలవల్ల ఆ సినిమా క్యాన్సిల్ అయితే.. ఎంత బాధ ఉంటుందో ఆ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reddy) మీడియాతో పంచుకున్నారు. తనకు అవకాశం ఇచ్చిన ఒక హీరో తన కొడుకుతో సినిమా చేయాలని అడగడంతో కాదనలేక సినిమా సెట్ పైకి వెళ్లే వరకు దాదాపు పది నెలల పాటూ కష్టపడ్డారట. కానీ సినిమా ఆగిపోయింది. దీని వెనుక అసలు కారణాలు చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు డైరెక్టర్.
ప్రముఖ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈయన.. నాగార్జున (Nagarjuna) హీరోగా నటించిన ‘ ఢమరుకం’ సినిమాకు దర్శకత్వం వహించి.. మంచి విజయం అందుకున్నారు. ఇదిలా ఉండగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన.. ఇదే విషయంపై మాట్లాడుతూ.. “ఢమరుకం సినిమా విడుదలైన రోజే నాకు పెద్ద ఆఫర్ వచ్చింది. కానీ అదే రోజు నాగార్జున పిలిచి నాగచైతన్య(Naga Chaitanya)తో ఒక సినిమా చేయమని అడిగారు. అయితే ఢమరుకం లాంటి పెద్ద సినిమా చేసే అవకాశం ఇచ్చిన నాగార్జున మాటకు నేను విలువనిచ్చి నాగచైతన్యతో సినిమా చేయడానికి వెంటనే ఒప్పుకున్నాను.
అయితే అలా ప్రకటించిన ప్రాజెక్ట్ ఏదో కాదు నాగార్జున క్లాసిక్ హిట్ ‘హలో బ్రదర్’ రీమేక్. ఇందులో నాగచైతన్య ద్విపాత్రాభినయం చేయాల్సి ఉండగా.. సమంత(Samantha ), తమన్నా(Tamannaah ) హీరోయిన్లుగా అనుకున్నాము. ఈ సినిమా స్క్రిప్ట్ పై దాదాపు పది నెలలపాటు కష్టపడి పని చేశాము. అంతా సిద్ధమైంది. సెట్ పైకి వెళ్లాల్సిన సమయంలో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. అలా చైతు మూవీ కోసం ఏకంగా 10 నెలల సమయాన్ని, కష్టాన్ని వృధా చేసుకున్నాము” అంటూ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:Sikindar: రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న సికిందర్.. వాటిని యాడ్ చేస్తూ!
ప్రముఖ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తక్కువ బడ్జెట్ తో కామెడీ చిత్రాలు చేసి భారీ పాపులారిటీ అందుకున్నారు. ముఖ్యంగా అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ ఆరంభించిన ఈయన.. 1997లో ఆలీ హీరోగా వచ్చిన ‘ఆషాడం పెళ్ళికొడుకు’ సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత అదిరిందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా, యమగోల మళ్ళీ మొదలైంది, బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్స్, కుబేరులు, డమరుకం, మామ మంచు అల్లుడు కంచు, రాగల 24 గంటల్లో వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.