E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవికి చక్రధర్ సర్ప్రైజ్.. అవనికి నిజం చెప్పిన మీనాక్షి.. పల్లవికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవికి చక్రధర్ సర్ప్రైజ్.. అవనికి నిజం చెప్పిన మీనాక్షి.. పల్లవికి షాక్..
Advertisement

Intinti Ramayanam Today Episode November 9th : నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి వాళ్ల నాన్న చక్రధర్ అని చెప్పింది కదా.. నా భర్త చక్రధర్ ఇద్దరు ఒక్కటేనా అని ఆలోచిస్తూ ఉంటుంది. వాడే వీడైతే ఎలా అని మీనాక్షి ఆలోచిస్తూ ఉండగా అవని లోపలికి వస్తుంది. ఏంటమ్మా అంతగా ఆలోచిస్తున్నావు అని మీనాక్షిని అడుగుతుంది. పల్లవి వాళ్ళ నాన్న పేరు చక్రధర్ అని అన్నారు ఆయన బిజినెస్ మాన్ అవునా అని అడుగుతుంది. పేరుకే మంచి బిజినెస్ మాన్ మూర్ఖుడు. చాలా కోపిస్తే ఆయన ఏమనుకుంటే అది చేయాలని అనుకుంటారు. నీకు ఆయన ఫోటో చూపిస్తాను అని చక్రధర ఫోటోని అవని చూపిస్తుంది. అతని ఫోటో చూడగానే భయంతో మీనాక్షి కళ్ళు తిరిగి పడిపోతుంది.. అమ్మ ఏమైంది అమ్మ అని టెన్షన్ పడుతూ ఉంటుంది అవని.. మీనాక్షిని హాస్పిటల్ కు తీసుకొని వెళ్తుంది అవని. తన తల్లికి ఏమీ కాలేదు అని తెలుసుకున్న అవని కాస్త రిలాక్స్ అవుతుంది.. అవనికి తోడు ఎవరు వెళ్ళలేదు అయితే అవని దారుణంగా మాట్లాడడంతో అక్షయ్ అందరికీ క్లాస్ పీకుతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అవినీ అన్ని పనికిమాలిన పనిలే చేస్తుంది అని శ్రియ పల్లవి ఇద్దరు కూడా అవని అవమానించేలా మాట్లాడుతుంటారు.. ఏమన్నా ఒక రూపాయిలు ఆపము వచ్చేది ఏమీ లేదు కదా మరి ఇలా చేయడం ఎందుకు అని అంటారు. శ్రియ పల్లవిలు అవనిని తిడుతూ ఉంటే అక్షయ్ అందరికీ క్లాస్ పీకుతాడు.. ఏం తెలుసు అని గురించి మాట్లాడుతున్నారు ఏదో అనుమానం ఉండడం వల్లే మీరు ఇలా మారిపోయారు అని అంటాడు. నా భార్య గురించి ఎవరైనా ఒక్క మాట మాట్లాడితే నేను మర్యాద కూడా ఇవ్వను అని అక్షయ్ అందరికీ వార్నింగ్ ఇస్తాడు. అవని కి ఫోన్ చేస్తే అవని లేదండి నేను వచ్చేస్తున్నాను అని అంటుంది.

Advertisement

మీనాక్షి ఉన్న రూమ్ లోకి చక్రధర వెళ్తాడు. నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు. నా గురించి అందరికీ చెప్పడానికి వచ్చావా అని అంటాడు.. దానికి భయపడి పోయిన మీనాక్షి నేను నా పిల్లల్ని కలవడానికి వచ్చాను నీ గురించి ఎవరికీ ఏమీ చెప్పలేదు అని భయపడుతుంది. నువ్వు బతికుంటే నాకు ఎప్పటికైనా నష్టమే అందుకే నువ్వే లేకుండా పోతే నాకు ఏ సమస్య ఉండదు అని చక్రధర్ అక్కడ ఉన్న దిండును తీసుకొని మీనాక్షిని చంపేందుకు దగ్గరకు వస్తాడు. మీనాక్షి నన్ను చంపొద్దు అని గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది.

డాక్టర్ దగ్గర నుంచి వచ్చిన అవని లోపలికి రాగానే తన తల్లిని చక్రధర్ చంపబోతున్నాడని చూసి ఒక్కసారిగా గుండెలు పగిలేలా షాక్ అవుతుంది. రేయ్ అంటూ కోపంగా లోపలికి వచ్చిన అవని చక్రధర్ ను అక్కడున్న ట్రే తో కొట్టి పక్కకి తోసేస్తుంది.. మా అమ్మని చంపబోతావని సెలెన్స్ స్టాండ్ తీసుకొని కొట్టబోతుంది. మీనాక్షి అవనిని అడ్డుకుంటుంది. అవని ఆగమ్మ అతని నా భర్త నీ కన్న తండ్రి అని చెప్పేస్తుంది. దాంతో అవని ఒక్కసారిగా షాక్ అవుతుంది. తన తండ్రి చక్రధర్ తెలుసుకొని అవని టెన్షన్ పడుతుంది.

Advertisement

మొదట నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. డబ్బు మీద ఆశతో సిటీకి వచ్చాడు. మొదట్లో బాగానే ఉన్నాడు కానీ ఆ తర్వాత నువ్వు నాకొద్దు అని నన్ను వదిలేసి పిల్లల్ని వదిలేసి ఇక్కడికి వచ్చేసారు. అతని వెతుక్కుంటూ నేను వస్తే వేరే పెళ్లి చేసుకున్నాడు అని తెలిసి నేను బాధపడ్డాను. కానీ ఇలాంటి దుర్మార్గుడు గురించి నా పిల్లలకి తెలియకూడదని అనుకున్నాను అని మీనాక్షి అవినీతో చెప్తుంది.. ఇక అక్కడి నుంచి ఇంటికి వచ్చిన అవనీని పల్లవి ఏదో ఒకటి అంటుంది..

Also Read : షీలా పుట్టినరోజు వేడుకకు బాలు దూరం.. ప్రభావతి హ్యాపీ.. బాధపడిన సత్యం..

నువ్వేం మాట్లాడినా ఆలోచించి మాట్లాడు మీకు నేను సొంత అక్క లాంటి దాన్ని అని ఆమె అంటుంది. నువ్వు నా తోడు కోడలు కాబట్టి అక్క అని పిలుస్తున్నాను. నీలాంటి చీప్ క్యారెక్టర్ కి.. ఒక అనాధ వైన నువ్వు, ఎవరో తెలియని నీకు నేను చెల్లెలా ఏం మాట్లాడుతున్నావ్..? మీ నాన్న గురించి మీ అమ్మ చెప్పుకోలేదు అంటే నువ్వు అక్రమసంతానమే అయి ఉంటావు అని అన్నగాని అవని నోరు ముయ్యి అని అంటుంది.. మీనాక్షి ఏం మాట్లాడుతున్నావే అని పల్లవి చంప పగలగొడుతుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో చక్రధర్ గురించి పల్లవికి నిజం తెలిసి పోతుందా..? అవని తన అక్క అన్న సంగతి తెలుసుకుంటుందా..? చక్రధర్ నెక్స్ట్ ఏం చేస్తాడు అన్నది చూడాలి..

Related News

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

Big Stories

Advertisement
×