Bus Accident: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సును వెనుక నుంచి తుఫాను వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ..క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఆర్టీసీ బస్సు సంగారెడ్డి నుంచి హైదరాబాద్ వైపు ప్రయాణిస్తుండగా, వెనుక నుంచి అధిక వేగంతో వస్తున్న తుఫాన్ వాహనం అదుపు తప్పి బస్సు వెనుక భాగాన్ని ఢీకొట్టింది. దీంతో తుఫాన్ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఒకరు స్పాట్ లోని మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని.. సహాయక చర్యలు ప్రారంభించారు. తీవ్ర గాయాలపాలైన వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ తక్షణమే వాహనాన్ని ఆపడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించడానికి సీసీటీవీ ఫుటేజ్, వాహన వేగం, డ్రైవర్ మత్తులో ఉన్నాడా అనే అంశాలను పరిశీలిస్తున్నారు. ప్రాథమికంగా అధిక వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
Also Read: పెళ్లి కారు టైరు పేలి.. ముగ్గురు స్పాట్‌డెడ్
ఈ నేపథ్యంలో సంగారెడ్డి రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలను పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించారు. బస్సు, తుఫాన్ వాహనాన్ని రోడ్డు పక్కకు తొలగించిన తర్వాత ట్రాఫిక్ మామూలు స్థితికి వచ్చింది.