Priyanka Jain (Source: Instagram)
ప్రియాంక జైన్.. మౌనరాగం, జానకి కలగనలేదు వంటి సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా మౌనరాగం సీరియల్ లో మాటలు రాని అమ్మాయిగా అమాయకపు పాత్రలో ఎంతోమంది ఆడవారి హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంది.
Priyanka Jain (Source: Instagram)
ఈ సీరియల్స్ అందించిన క్రేజ్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో కంటెస్టెంట్ గా పాల్గొని, అక్కడ తన మేనరిజంతో, వ్యక్తిత్వంతో టాప్ ఫైవ్ లో ఒకరిగా నిలిచింది.
Priyanka Jain (Source: Instagram)
ఇక హౌస్ నుండి బయటకు రాగానే తన ప్రియుడు శివ్ కుమార్ తో ఏడడుగులు వెయ్యబోతోంది అంటూ వార్తలు వినిపించాయి.
Priyanka Jain (Source: Instagram)
దీనికి తోడు ఇటీవల ఈమె శివ్ తో నన్ను పెళ్లి చేసుకుంటావా అని కూడా అడిగింది. అయితే ఇలా రోజుకొక స్టంట్ చేస్తున్నారే తప్ప పెళ్లి పీటలు ఎక్కలేదు అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Priyanka Jain (Source: Instagram)
ఇదిలా ఉండగా ఈరోజు ప్రియాంక పుట్టినరోజు. ఈ ఏడాదికి 27 సంవత్సరాలు వచ్చేసాయి. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రియాంక షేర్ చేయడంతో.. 27 ఏళ్లు వచ్చాయి ఇప్పటికైనా పెళ్లి చేసుకో అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Priyanka Jain (Source: Instagram)
మరి నెటిజన్స్ సలహా మేరకు కనీసం ఈ ఏడాది అయినా ప్రియాంక తన బాయ్ ఫ్రెండ్ తో ఏడడుగులు వేస్తుందో లేదో చూడాలి అని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.