Dacoit Release: హీరో అడవి శేష్(Adivi Sesh) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం డెకాయిట్ (Dacoit). మేజర్ సినిమా తర్వాత ఈయన నటిస్తున్న సినిమా కానున్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి. అడవి శేష్ చేసేది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఎంతో విభిన్నమైన మంచి కంటెంట్ ఉన్న కథలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తూ వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. త్వరలోనే డెకాయిట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 25,2025న క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.
ఇకపోతే తాజాగా ఈ సినిమా విడుదల గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం కారణంగా నటుడు అడవి శేష్ , మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur)గాయపడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో భాగంగా కొద్ది రోజులపాటు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించడంతో అడివి శేష్ ఈ సినిమా షూటింగ్ పనులను పక్కనపెట్టి విశ్రాంతి తీసుకుంటున్నారని తద్వారా షూటింగ్ పూర్తికాని నేపథ్యంలో ఈ సినిమా విడుదల వాయిదా పడింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇలా ఈ సినిమా విడుదల వాయిదా పడింది అంటూ వస్తున్న వార్తలపై చిత్ర బృందం స్పందించారు.
ఈ సందర్భంగా డెకాయిట్ సినిమా విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన తెలియజేశారు.. ఈ సినిమా డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఒక పోస్టర్ విడుదల చేశారు. ఇలా పోస్టర్ విడుదల కావడంతో సినిమా వాయిదా పడలేదని యధావిధిగా విడుదల కాబోతోందని స్పష్టమవుతుంది. అయితే ఇదే రోజు శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటించిన ఛాంపియన్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదేవిధంగా బాలీవుడ్ నటి ఆలియా భట్ హీరోయిన్ గా నటించిన ఆల్ఫా సినిమా కూడా అదే రోజు విడుదల కానున్న నేపథ్యంలో బాక్స్ ఆఫీస్ పోటి భారీగా ఉండబోతుందని తెలుస్తుంది.
తెలుగు హిందీ భాషలలో విడుదల…
ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. అడివి శేష్, మృణాళ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు షానిల్ డియో దర్శకత్వం వహించగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కస్యప్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు శేష్ కథ స్క్రీన్ ప్లే అందించబోతున్నారు. ఈ సినిమా తెలుగుతోపాటు హిందీ భాషలో కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల ఎంతో మంచి అంచనాలను పెంచేసాయి.
Also Read: Upasana -Klin Kaara: క్లిన్ కారాను అందుకే చూపించలేదు.. ఆ భయమే కారణమా?